ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి

ABN , First Publish Date - 2021-10-27T06:30:21+05:30 IST

ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి

ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి
మాట్లాడుతున్నా సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు

సీపీఎం జిల్లా కార్యదర్శి రఘు

ఉప్పలూరు (కంకిపాడు), అక్టోబరు 26 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరముందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు అన్నారు. మం డలంలోని ఉప్పలూరులో మంగళవారం కంకిపాడు మండల ఐదవ మహాసభ జరిగింది. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆర్‌ రఘు మాట్లా డుతూ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరే కంగా ప్రజలను సమాయత్తం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచకర్ల రంగారావు, సీహెచ్‌ నాగేశ్వరమ్మ, బి. రాజేష్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. హరిబాబు, సిహెచ్‌ రెడ్డయ్య, వి. రమేష్‌, కె. మురళి, యు. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

ఫ కంకిపాడు మండల కార్యదర్శిగా తాడంకి నరేష్‌, సభ్యులుగా పంచకర్ల రంగారావు, వి. శివశంకర్‌, పి. దుర్గాప్రసాద్‌, సిహెచ్‌ శ్రీ హరి, జి. కుమారి, ఏ ఉషారాణి, వి. జాన్‌ మోజస్‌. జె. రవి, ఎం.చంటి బాబు, వి.మరియదాసును ఎన్నుకున్నారు. 

 కేంద్రం మెడలు వంచాలి

గన్నవరం : కేంద్ర ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాట మాడుతుందని సీపీఎం మండల కార్యదర్శి మల్లంపల్లి ఆంజనేయులు అన్నారు. మధ్యప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీ ఘటనలో మృతి చెందిన రైతుల చిత భ స్మాన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కృష్ణానదిలో కలుపుతుండగా గన్నవరం నుంచి సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు బైక్‌ ర్యాలీతో విజయవాడ వెళ్లారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.  పోరాటాలతోనే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని చెప్పారు. పిల్లి మహేష్‌, మాదిరెడ్డి చిన్న తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-10-27T06:30:21+05:30 IST