Ongole: మహాత్ముని విగ్రహానికి వైసీపీ కండువాలు

ABN , First Publish Date - 2021-10-24T17:14:22+05:30 IST

ప్రకాశం జిల్లా కనిగిరిలో మహాత్ముని విగ్రహానికి అవమానం జరిగింది.

Ongole: మహాత్ముని విగ్రహానికి వైసీపీ కండువాలు

ఒంగోలు: ప్రకాశం జిల్లా కనిగిరిలో మహాత్ముని విగ్రహానికి అవమానం జరిగింది. పోలీస్ స్టేషన్, తహశీల్దార్ ప్రభుత్వ కార్యాలయ సముదాయాల ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం మెడలో వైసీపీ కండువాలు ప్రత్యక్షమయ్యాయి. ఫోటోలు వైరల్ కావడంతో  గుర్తు తెలియని వ్యక్తులు కండువాలను తొలగించారు. ఈ ఘటనను దళిత సంఘ నాయకులు తీవ్రంగా ఖండించాయి. ఘటనకు పాల్పడిన బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-10-24T17:14:22+05:30 IST