Prakasam జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం

ABN , First Publish Date - 2021-11-02T14:04:44+05:30 IST

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

Prakasam జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం

ఒంగోలు: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఒంగోలులో తెల్లవారుజాము నుండి వర్షం కురుస్తుండటంతో నీరు నిలిచి శివారు కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఉదయం నుండి వర్షంతో స్కూళ్లకు వెళ్లలేక విద్యార్థులు, చిరు వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. నగరవాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. 

Updated Date - 2021-11-02T14:04:44+05:30 IST