ఒంగోలు: ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్లో ఆంజనేయులు అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చెల్లెలు వరుసయ్యే యువతిని ఆంజనేయులు ఇంటి నుండి తీసుకుని పరారయ్యాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. స్టేషన్లో బంధువులు మందలించడంతో అవమానంగా భావించిన ఆంజనేయులు గొంతుకు టవల్ బిగించుకున్నాడు. కానిస్టేబుల్ గుర్తించడంతో చికిత్స కోసం యువకుడిని ఒంగోలు కిమ్స్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి