Gundlakamma project.. కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు

ABN , First Publish Date - 2022-09-02T20:15:59+05:30 IST

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు నుంచి రెండో రోజు శుక్రవారం కూడా నీరు వృదాగా పోతోంది.

Gundlakamma project.. కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు

ప్రకాశం (Prakasam): కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు (Gundlakamma project) గేటు నుంచి రెండో రోజు శుక్రవారం కూడా నీరు వృదాగా పోతోంది. బుధవారం రాత్రి గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడో గేటు కొట్టుకుపోయింది. స్టాప్ లాక్ ద్వారా నీటిని ఆపేందుకు ఇంజనీర్లు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో 13, 14, 15 గేట్లు ఎత్తి ప్రాజెక్టులో నీటి వత్తిడిని అధికారులు తగ్గిస్తున్నారు. ఇప్పటికే 12వేల క్యుసెక్కుల నీరు సముద్రం పాలైంది. కాగా ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. 


అధికారుల పర్యవేక్షణలోపం, సరైన మరమ్మతులు లేకపోవడంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడవ గేటు విరిగిపోయింది. గతరాత్రే గేటు దిగువభాగం దెబ్బతినటంతో భారీస్థాయిలో నీరు వృథాగా పోతోంది. దీర్ఘకాలంగా గేట్లు నిర్వహణ, మరమ్మతుల్లో జరుగుతున్న నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తుండగా ప్రాజెక్టులో ఉన్న నీటిలో అర టీఎంసీ నీరు గురువారం మధ్యాహ్నానికే దిగువకు వెళ్లిపోయాయి. తక్షణం దెబ్బతిన్న గేటు మరమ్మతుల్లో యంత్రాంగం నిమగ్నమయింది.

Updated Date - 2022-09-02T20:15:59+05:30 IST