ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం

ABN , First Publish Date - 2020-11-26T15:36:33+05:30 IST

తుపాను ప్రభావంతో జిల్లాలో పలు చోట్ల మోస్తారు వర్షం కురుస్తోంది.

ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం

ప్రకాశం: తుపాను ప్రభావంతో జిల్లాలో పలు చోట్ల మోస్తారు వర్షం కురుస్తోంది. ఒంగోలు, సింగరాయకొండ, కందుకూరు, అద్దంకి, గిద్దలూరు, చీమకుర్తి, కనిగిరిలో మోస్తారుగా వర్షం పడుతోంది. చీరాల, కొత్తపట్నం, పాకల, రామాయపట్నం సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా చలిగాలులు వీస్తున్నాయి. తుపాను సహాయ చర్యల కోసం ఒంగోలు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూము ఫోన్ నెంబర్ 1077గా తెలిపారు. 

Updated Date - 2020-11-26T15:36:33+05:30 IST