
ఒంగోలు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు కర్నూలు నుండి విజయవాడ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణీకులు ఉన్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.