Ongole: బాలయోగి గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-01-08T16:55:04+05:30 IST

ప్రకాశం జిల్లా దర్శి బాలయోగి గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థి మృతి కలకలం రేపుతోంది.

Ongole: బాలయోగి గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి

ఒంగోలు: ప్రకాశం జిల్లా దర్శి బాలయోగి గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థి మృతి కలకలం రేపుతోంది. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థి ప్రవీణ్ నాయక్ ఒక్కసారిగా కుప్పకూలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా మార్గమధ్యలోనే విద్యార్థి మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని రిమ్స్ వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. 

Updated Date - 2022-01-08T16:55:04+05:30 IST