పవన్ కళ్యాణ్‌ని అక్కడ చూసి సర్‌ప్రైజ్ అయ్యా.. : ప్రకాశ్ రాజ్

Published: Thu, 23 Jun 2022 19:28:51 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పవన్ కళ్యాణ్‌ని అక్కడ చూసి సర్‌ప్రైజ్ అయ్యా.. : ప్రకాశ్ రాజ్

యాక్షన్ కింగ్ అర్జున్ (Action King Arjun) దర్శకత్వంలో విశ్వక్ సేన్ (Vishwak Sen), ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun) హీరోయిన్లుగా నటిస్తున్న చిత్ర ఓపెనింగ్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ని చూసి సర్‌ప్రైజ్ అయ్యానని అన్నారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj). యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా, ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా రచయిత, నిర్మాత, దర్శకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం గ్రాండ్‌గా గురువారం ప్రారంభమైయింది. అర్జున్ సొంత బ్యానర్ అయినటువంటి శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌లో ప్రొడక్షన్ నెం 15గా తెరకెక్కునున్న ఈ చిత్రంతో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై.. క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షంలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా హాజరయ్యారు.


పూజా కార్యక్రమాల అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘పవన్ కళ్యాణ్‌గారిని ఇక్కడ చూసి సర్‌ప్రైజ్ అయ్యాను. ‘మీరు ఇక్కడ ఏంటి?’ అని అడిగాను. ‘అర్జున్ గారంటే ఇష్టం.. అద్భుతమైన వ్యక్తి. ఆయన పక్కన నిల్చోవాలనిపించింది’ అన్నారు. ఇది అర్జున్‌గారు ఇన్నేళ్ళుగా సంపాదించుకున్న మంచితనం. తన కుమార్తెని ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఇంకా నచ్చింది. ఈ సినిమాలో నేను కూడా ఉంటా. ఐతే డబ్బులు మాత్రం తీసుకోనని కండీషన్ పెట్టా(నవ్వుతూ). ఐశ్వర్యని మీ అందరూ ఆదరించాలి. విశ్వక్ ఎనర్జిటిక్ హీరో. తనకంటూ ఒక ఇమేజ్‌ని సంపాదించుకొని ముందుకు వెళ్తున్నారు. మంచి టెక్నికల్ టీమ్ పని చేస్తుంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.

పవన్ కళ్యాణ్‌ని అక్కడ చూసి సర్‌ప్రైజ్ అయ్యా.. : ప్రకాశ్ రాజ్


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International