ప్రకాశం బ్యారేజ్ వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

ABN , First Publish Date - 2020-09-29T12:29:09+05:30 IST

ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జారీమునేరు, వైరా, కటలేరు నుంచి 30 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం బ్యారేజ్ వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

అమరావతి: ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జారీమునేరు, వైరా, కటలేరు నుంచి 30 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో 6లక్షల 20వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 6 లక్షల 12వేల క్యూసెక్కులుగా ఉంది. కాగా, కృష్ణా ఈస్ట్రన్, వెస్ట్రన్ కాలువకు సాగునీటి అవసరాల కోసం 8వేల క్యూసెక్కుల వరద నీటిని వదిలారు. విజయవాడలోని తారకరామ నగర్, భూపేష్ గుప్త నగర్, బాలాజీనగర్, రామలింగేశ్వర నగర్ ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల ప్రజలు పునరావాస శిబిరాల్లోనే తలదాచుకున్నారు. మరోవైపు భారీ వరదల కారణంగా కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి.

Updated Date - 2020-09-29T12:29:09+05:30 IST