పురపాలకం.. ప్రకృతి వనం

ABN , First Publish Date - 2020-11-30T03:53:02+05:30 IST

ప్రకృతివనాలను పెం పొందించుకునేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పల్లెల తోపాటు పట్టణాలలోనూ ఈ వనాలను పెంపొందిస్తోంది.

పురపాలకం.. ప్రకృతి వనం
25వ వార్డులో ఏర్పాటుచేసిన ప్రకృతివనాలు

8 పాలమూరు పురపాలికలో 22 ప్రకృతి వనాలు

8 ఇప్పటికి 17 చోట్ల పూర్తి 

8 రూ.56 లక్షలతో వనాల ఏర్పాటు


మహబూబ్‌నగర్‌, నవంబరు 29 : ప్రకృతివనాలను పెం పొందించుకునేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పల్లెల తోపాటు పట్టణాలలోనూ ఈ వనాలను పెంపొందిస్తోంది. పల్లెలతో పాటు కాంక్రీట్‌ జంగిల్‌ పట్టణాలలోనూ వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే పాలమూరు పురపాలికలో 22చోట్ల ప్రకృతివనాలను ఏర్పాటు చేస్తున్నారు. పాలమూరు పట్టణం రోజురోజుకు పెరుగుతుం డటం, వ్యాపార, వాణిజ్య సముదాయాలకు తోడు వాయి కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతోంది. ఈ కాలుష్యాన్ని నియంత్రించడానికి కాంక్రీట్‌ పట్టణాల్లో చిట్టడవులను పెంచి కాలుష్యాన్ని తగ్గించాలని పలు పట్ణణాలలో వీటవిని ఏర్పాటుచేస్తున్నారు. పట్టణ నలువైపుల ఉన్న ఖాళీ స్థలాలు ఎంపికచేసి అడవులను పెంచుతున్నారు. రూ.56 లక్షల వ్యయంతో వీటినినిర్మిస్తున్నారు. ఒక్కో వనంలో వెయ్యి మొక్కలకు పైగా మొ క్కలను వరుస క్రమంలో ఏర్పాటుచేయనున్నారు. కాలనీలలోని ప్రజలు ఈ ప్రకృతివనాలలో సేదదీరేందుకు బెంచీలను కూడా ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటికే 17 చోట్ల వనాలను ఏర్పాటుచేయగా నెలరోజుల్లో మిగతావి కూడా పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. పట్టణంలోని లక్ష్మీనగర్‌ కాలనీ, తిరుమలహిల్స్‌, ఎదిర, హౌసింగ్‌బోర్ట్‌ కాలనీ, పాలకొండ, భగీరథకాలనీ, బాలాజీనగర్‌, అలీస్‌మార్ట్‌ వెనుకవైపు, నూతన కలెక్టరేట్‌, పిల్లలమర్రి  సమీపంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మునిసిపల్‌ అధికారులు ఎప్పటికప్పుడు వీటిని పర్యవేక్షిస్తున్నారు. 

Updated Date - 2020-11-30T03:53:02+05:30 IST