ప్రాన్స్‌ టిక్కా మసాలా

ABN , First Publish Date - 2020-12-26T20:53:26+05:30 IST

న్యూ ఇయర్‌ పార్టీ అంటే నోటికి కాస్త మసాలా ఘాటు తగలాల్సిందే. అందులోనూ కాస్త ప్రత్యేకమైన వంటలు ఉంటే ఆ జోషే వేరు. స్టఫ్‌డ్‌ మష్రూమ్స్‌, టోస్టెడ్‌ రావియోలి, పనీర్‌ టిక్కా మసాలా, పనీర్‌ అఫ్ఘానీ వంటి రెసిపీలతో ఇంటిల్లిపాది కొత్త సంవత్సరాన్ని

ప్రాన్స్‌ టిక్కా మసాలా

హౌ ఈజ్‌ జోష్‌!

న్యూ ఇయర్‌ పార్టీ అంటే నోటికి కాస్త మసాలా ఘాటు తగలాల్సిందే. అందులోనూ కాస్త ప్రత్యేకమైన వంటలు ఉంటే ఆ జోషే వేరు. స్టఫ్‌డ్‌ మష్రూమ్స్‌, టోస్టెడ్‌ రావియోలి, పనీర్‌ టిక్కా మసాలా, పనీర్‌ అఫ్ఘానీ వంటి రెసిపీలతో ఇంటిల్లిపాది కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించండి.


కావలసినవి: ప్రాన్స్‌ - 10 (రొయ్యలు పెద్ద సైజులో ఉన్నవి తీసుకోవాలి), నిమ్మరసం - అర టీస్పూన్‌, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, పెరుగు - అరకప్పు, క్రీమ్‌ - పావు కప్పు, ఉల్లిపాయలు - రెండు, టొమాటో ప్యూరీ - అరకప్పు, కశ్మీరీ కారం - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, గరంమసాల - ఒక టేబుల్‌స్పూన్‌, వెన్న - ఒక టేబుల్‌స్పూన్‌, నూనె - సరిపడా, కొత్తిమీర - ఒకకట్ట.


తయారీ విధానం: ఒక పాత్రలో శుభ్రంగా కడిగిన ప్రాన్స్‌ తీసుకోవాలి. అందులో నిమ్మరసం, కారం, అల్లంవెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు వేసి కలుపుకొని పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై ఒక మందపాటి పాన్‌ తీసుకుని వెన్న వేసి వేడి చేయాలి. తరువాత రొయ్యలు వేసి చిన్నమంటపై నాలుగైదు నిమిషాలు వేగించి మరో పాత్రలోకి  తీసుకుని పక్కన పెట్టాలి. అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర వేసి వేగించాలి. తరిగిన ఉల్లిపాయలు వేసి మరికాసేపు వేగించుకోవాలి. అల్లంవెల్లుల్లి పేస్టు వేయాలి. కారం, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసి చిన్నమంటపై మరో నాలుగు నిమిషాలు ఉడికించాలి. తరువాత మిశ్రమం చిక్కబడుతున్న సమయంలో క్రీమ్‌, పెరుగు, గరంమసాల వేసి కలియబెట్టుకోవాలి. చివరగా వేగించి పెట్టుకున్న రొయ్యలు వేయాలి. రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. కాసేపు ఉడికించి కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని దింపుకోవాలి. చపాతీలోకి లేదా అన్నంలోకి ఈ రొయ్యల మసాల కర్రీ రుచిగా ఉంటుంది.




Updated Date - 2020-12-26T20:53:26+05:30 IST