Prasanth Kishore పై మాజీ మంత్రి సంచలన కామెంట్స్..

ABN , First Publish Date - 2021-10-30T06:01:38+05:30 IST

ప్రశాంత కిశోర్‌ ఓ బచ్చా...

Prasanth Kishore పై మాజీ మంత్రి సంచలన కామెంట్స్..

  • ఆయనో బచ్చా !
  • రాహుల్‌ గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు
  • 2024లో బలిజ సామాజికవర్గం నుంచే ముఖ్యమంత్రి అవుతారు
  • కేంద్ర మాజీమంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు చింతా మోహన్


అనంతపురం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రశాంత కిశోర్‌ ఓ బచ్చా... రాహుల్‌ గాంధీ గురించి మాట్లాడే నైతికత అతనికి లేదని కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ స భ్యుడు చింతా మోహన అన్నారు. శుక్రవారం అనంతపురం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో రెండు సా మాజికవర్గాలే పాలన సాగిస్తున్నారన్నారు. ఆరు శాతం ఉన్న ఆ వర్గాలు రాష్ర్టాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బలిజల ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నారు. ఇప్పటి వరకూ ఆ సామాజికవర్గం నుంచి ముఖ్యమంత్రిగా ఎవరూ ఎన్నిక కాలేదన్నారు. 2024లో బలిజ, కాపు సామాజికవర్గం నుంచి ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఈ విషయం తాను వ్యక్తిగతంగా చెబుతున్నానన్నారు. ఆ సామాజికవర్గంలో సమర్థవంతమైన నాయకుడి కోసం వెతుకుతున్నానన్నారు. ప్రశాంతకిశోర్‌ కాదు... వారి నాన్న, తాత వచ్చినా ఆపలేరన్నారు. కాంగ్రెస్‌ గురించి ప్రశాంత కిశోర్‌కు ఏం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడటానికి కారణం ఇద్దరు నాయకులన్నారు. వారిలో ఒకరు పీవీ నరసింహారావన్నారు. అయోధ్య ఘటనతోనే మైనార్టీలు కాంగ్రె్‌సకు దూరమయ్యారన్నారు. రాష్ట్ర విభజనకు కారణం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డన్నారు. చెన్నారెడ్డిని దించేందుకు ఒక నాయకుడు పాత బస్తీలో మారణహోమం సృష్టించారన్నా రు. వందలాది మందికి కాళ్లు, చేతులు తీసేశారన్నారు. ఆ నాయకుడు ఇ ప్పుడు లేడని, చనిపోయాడన్నారు. మిస్టర్‌ జగన్మోహనరెడ్డి మీ నాన్న ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. నీవూ ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఇకచాలు... తప్పుకోండని జగనకు సూచించారు. నిత్యావసర, ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. 


Updated Date - 2021-10-30T06:01:38+05:30 IST