కేసీఆర్‌ను కలిసిన ప్రశాంత్‌కిషోర్‌, ప్రకాష్‌రాజ్‌

ABN , First Publish Date - 2022-02-27T23:14:27+05:30 IST

రాష్ట్రంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ పర్యటించారు. పర్యటన అనంతరం సీఎం కేసీఆర్‌ను ప్రశాంత్‌కిషోర్

కేసీఆర్‌ను కలిసిన ప్రశాంత్‌కిషోర్‌, ప్రకాష్‌రాజ్‌

హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ పర్యటించారు. పర్యటన అనంతరం సీఎం కేసీఆర్‌ను ప్రశాంత్‌కిషోర్, సినీ నటుడు ప్రకాష్‌రాజ్ కలిశారు. ఈ సమావేశంలో దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ నేత శరద్‌పవార్‌తో భేటీ సారాంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ ముక్త్‌ భారత్‌’ అంటూ నినదించిన కేసీఆర్‌.. జాతీయ స్థాయిలో వేదిక ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ వ్యతిరేక కూటమి కట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులోభాగంగా ఆయన మరికొన్ని రాష్ట్రాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రాల పర్యటనలు, భవిష్యత్‌ కార్యాచరణపై కేసీఆర్‌తో పీకే చర్చించినట్లు టీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. గజ్వేల్‌ నియోజకవర్గంలో ప్రశాంత్‌కిషోర్‌, ప్రకాష్‌రాజ్‌ పర్యటించారు.


ప్రకాశ్‌రాజ్‌ శనివారం గజ్వేల్‌ నియోజకవర్గాన్ని సందర్శించారు. గజ్వేల్‌ పట్టణంలోని సమీకృత మార్కెట్‌, వైకుంఠధామం, మహతీ ఆడిటోరియం, మల్లన్నసాగర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ, కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆలోచనలు అభివృద్ధి రూపంలో గజ్వేల్‌లో ప్రతిబింబిస్తున్నాయని ప్రశంసించారు. దేశానికే ఆదర్శంగా గజ్వేల్‌ అభివృద్ధి చెందిందని, విదేశాల్లో పర్యటించిన అనుభూతి కలిగిందని చెప్పారు. అంతేకాకుండా తొగుట మండలం శివారులో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్‌ను ప్రకాశ్‌రాజ్‌ సందర్శించారు. పంపుహౌ్‌సలోకి వెళ్లి అక్కడ నీటిని ఎత్తిపోస్తున్న బాహుబలి మోటార్లను  పరిశీలించారు. మల్లన్న సాగర్‌ కట్టపైకి చేరుకుని డెలివరీ సిస్టర్నుల నుంచి వస్తున్న గోదావరి నీటిని చూసి పులకించిపోయారు.

Updated Date - 2022-02-27T23:14:27+05:30 IST