ప్రశ్నించినప్పుడే సమస్యలకు పరిష్కారం.

Published: Tue, 24 May 2022 23:39:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ప్రశ్నించినప్పుడే సమస్యలకు పరిష్కారం. ప్రసంగిస్తున్న ఏపీజీఈఏ కమిటీ అధ్యక్షుడు రమేష్‌

ఏపీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు రమేష్‌

రాజంపేట, మే 24:  ప్రశ్నించినపుడే సమస్యలు పరిష్కారం అవుతాయని ఏపీజీఈఏ జిల్లా కమిటీ అధ్యక్షులు రమేష్‌ పేర్కొ న్నారు. రాజంపేటలో మం గళవారం ఏపీజీఈఏ ఆధ్వ ర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమా నికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉద్యోగులందరూ ఐకమత్యంతో పోరాడాల్సిన అవ సరం ఉందన్నారు. ఏపీజీఈఏ కన్వీనర్‌ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నాగశేషు, కృష్ణ ప్రసాద్‌, శ్రీనివాస్‌, నాగేంద్ర, సుధాకర్‌, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.