అయ్యవారికీ గొంతు దిగని.. గోరుముద్ద

Published: Sun, 27 Mar 2022 00:35:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అయ్యవారికీ గొంతు దిగని.. గోరుముద్దపాఠశాలలో భోజనానికి కూర్చున్న ఎండీఏం ఏడీ శ్రీనివాస్‌, హోటల్‌ నుంచి బోజనం తెప్పించుకుని ఎంఈవో కార్యాలయంలో తింటున్న ఎండీఎం ఏడీ

పిల్లలతో తినేందుకు కూర్చున్న ఎండీఎం ఏడీ

తినలేక వదిలేసి హోటల్‌ భోజనం తెప్పించుకున్న వైనం


ప్రత్తిపాడు, మార్చి 26: జగనన్న గోరుముద్ద అయ్యవార్లకు గొంతు దిగటం లేదు. ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఘోరంగా గోరుముద్ద పేరుతో ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం ఎండీఎం ఏడీ శ్రీనివాస్‌ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో  విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసేందుకు కూర్చున్నారు. ఆయనతో పాటు కూర్చున్న ఎంఈవో రమాదేవి తనకు శనివారం ఉపవాసం  అని భోజనానికి దూరంగా ఉన్నారు. ఏడీ శ్రీనివాస్‌ మాత్రం అన్నం, పాయసం పెట్టించుకుని, ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నారు. అంతే... ప్లేటును మధ్యాహ్న బోజన నిర్వాహకురాలికి ఇచ్చి చేయి కడుక్కుని వెళ్లిపోయారు. తరువాత కొద్దిసేపటికి మండల విద్యావనరుల కేంద్రానికి వెళ్లి హోటల్‌ నుంచి  భోజనం తెప్పించుకుని తిన్నారు. 

 తొలుత ఆయన పాఠశాల హెచ్‌ఎం ఇంద్రావతితో పాటు ఉపాధ్యాయుల నుంచి లిఖితపూర్వకంగా వారి వివరణ తీసుకున్నారు. పాఠశాలకు బియ్యం సరఫరా చేసే డీలర్‌ను పిలిపించి విచారించారు. గత ఏడాది ఆగస్టులో వచ్చిన బియ్యం కింద వేయగా, ఆ తరువాత వచ్చిన బియ్యాన్ని పైన వేశారని, అవి వాడుతూ వచ్చారని, అడుగున ఉన్న బియ్యంకు పురుగులు పట్టినట్టు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ప్రత్తిపాడు తహసీల్దార్‌ కుటుంబరావు పురుగు పట్టిన బియ్యాన్ని సివిల్‌ సప్లయ్‌ గిడ్డంగికి తరలించి మంచి బియ్యాన్ని పాఠశాలకు పంపించారు. పురుగులు వస్తున్నా మౌనంగా ఉండటంపై పాఠశాల హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీనికి సంబంధించి పూర్తి వివరాలను డీఈవోకి అందజేస్తానని ఏడీ తెలిపారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.