
నేరేడుచర్ల: బహుజన రాజ్యాధికారం సాధించడమే తమ ఎజెండా అని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శనివారం ఆయన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాధికార యాత్ర 30 రోజులకు చేరిందన్నారు. ఇప్పటికే ఏడు నియోజకవర్గాల్లో పర్యటించగా, ప్రభుత్వ పాలన తీరుపై ప్రజల్లో అసహనాన్ని గుర్తించామన్నారు. జానాభా ప్రాతిపదన బీసీ, ఎస్సీ, ఎస్టీ అగ్రవర్ణ పేదలకు, మైనార్టీలకు సమాన హక్కులు కల్పించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. మహనీయులు అంబ్కేడర్, పూలే, కాన్షీరాం విధానాలతో తాను ప్రజల్లోకి వచ్చానని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకే తాను ముక్కలని ప్రవీణ్‌కుమార్ దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి