పీఆర్‌సీని వెంటనే అమలుచేయాలి

ABN , First Publish Date - 2021-01-25T07:03:45+05:30 IST

11వ పీఆర్‌సీ నివేదికను వెంటనే ఆమోదించి 2018 జులై 1నుంచి అమలుచేయాలని ఎస్‌టీయూ సంఘ సమావేశం డిమాండ్‌ చేసింది.

పీఆర్‌సీని వెంటనే అమలుచేయాలి

ముమ్మిడివరం, జనవరి 24: 11వ పీఆర్‌సీ నివేదికను వెంటనే ఆమోదించి 2018 జులై 1నుంచి అమలుచేయాలని ఎస్‌టీయూ సంఘ సమావేశం డిమాండ్‌ చేసింది. ముమ్మిడివరంలో పి.వెంకటేశ్వరరాజు అధ్యక్షతన ఆదివారం ఎస్‌టీయూ మండల శాఖ సమావేశం జరిగింది. ఈసమావేశంలో కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉపాధ్యాయులకు బకాయి ఉన్న డీఏలను వాయిదాల పద్ధతిలో కాకుండా ఏకమొత్తంలో చెల్లించాలని, నాడు-నేడు కార్యక్రమంలో పాల్గొన్న హెచ్‌ఎంలకు వేసవిలో పనిచేసినందుకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని వారు డిమాండు చేశారు. అనంతరం మండల నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా సీహెచ్‌.తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శిగా పీటీబీ వర్మ, ఆర్థిక కార్యదర్శిగా ఏపీ శ్రీనివాస్‌, అభయ కన్వీనర్‌గా బి.ఆదినారాయణమూర్తి, ఉపాధ్యక్షులుగా డీఎస్‌వీ ప్రసాద్‌, ఎ.సూర్యమోహన్‌తోపాటు మరో నలుగురు, కార్యదర్శులుగా  కె.నారాయణరావు, ఎ.గోపాలకృష్ణతోపాటు మరో ఐదుగురు,  ఆర్థిక కమిటీ సభ్యులుగా ఎం.శ్రీనివాస్‌తోపాటు మరో ముగ్గురు, జిల్లా కౌన్సిలర్లగా పి.వెంకటేశ్వరరాజుతోపాటు మరో 12మంది ఎన్నికయ్యారు. సమావేశంలో పీవీవీ సత్యనారాయణరాజు, ఎ.లక్ష్మణకుమార్‌, ఏవీవీ సత్యనారాయణ, ఏపీ శ్రీనివాస్‌, ఎ.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-01-25T07:03:45+05:30 IST