పీఆర్‌సీని అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-03-01T04:57:38+05:30 IST

ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులకు తక్షణమే వేతన సవరణ అమలు చేయాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఆల్తి రాంబాబు డిమాండ్‌ చేశారు.

పీఆర్‌సీని అమలు చేయాలి

విజయనగరం దాసన్నపేట, ఫిబ్రవరి 28:  ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులకు తక్షణమే వేతన సవరణ అమలు చేయాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఆల్తి రాంబాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం కోట జంక్షన్‌ సమీపంలోని పీఆర్‌టీయూ కార్యాలయంలో  విలేఖర్లతో మాట్లాడారు.  52 శాతంతో పీఆర్‌సీని అమలు చేయాలని, సీపీఎస్‌ను తక్షణమే రద్దు చేయాలని, నాడు- నేడు రెండో విడత పనుల బాధ్యతల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలని కోరారు. మునిసిపల్‌ ఉపాధ్యాయులకు జీపీఎఫ్‌ సదుపాయం కల్పించాలని, అమ్మఒడి లబ్ధిపొందలేని విద్యార్థులకు హెడ్‌మాస్టర్‌ అనుమతితో ఆ డబ్బులు అందజే యాలని, పీపీఎఫ్‌ , ఎపీజీఎల్‌ఐ రుణాలు, ఆర్జీ సెలవులు   మంజూరు చేయాలని  డిమాండ్‌ చేశారు. సంఘ ప్రతినిధులు తవిటి నాయుడు, శివప్రసాద్‌, రవీంద్రనాయుడు, రామునాయుడు, రమణ, శర్మ  పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-03-01T04:57:38+05:30 IST