APలో ముందస్తు ఎన్నికలు రావ్వొచ్చు: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2022-05-31T00:34:39+05:30 IST

విశాఖపట్నం: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఏపీ టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి

APలో ముందస్తు ఎన్నికలు రావ్వొచ్చు:  అచ్చెన్నాయుడు

విశాఖపట్నం: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఏపీ టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 160 సీట్లు వస్తాయన్నారు. పొత్తులపై ఎన్నికలు ముందే నిర్ణయం తీసుకుంటామని విశాఖపట్నంలో చెప్పారు. మహానాడుకి 5 లక్షల మంది వచ్చారని, కార్యక్రమం విజయవంతమైందన్నారు. వైసీపీ ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్ ఫొటో పెట్టుకునే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. దేవుడికి...దొంగల ముఠా నాయకుడికి పోలిక ఏమిటి? అని ప్రశ్నించారు. వైసీపీ బీసీ మంత్రులను నోరు లేని మూగ జీవులుగా పోల్చారు. జగన్ పాలనను మొత్తం నలుగురు రెడ్లకు అప్పగించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీసీలే లేనట్టుగా తెలంగాణకు చెందిన కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇచ్చారని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియదన్నారు. పవర్ హాలిడే ఇచ్చి రాష్ట్ర పరువును తీశారని విమర్శించారు.

ఇంకా ఏమన్నారంటే...

‘‘రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. మహిళలకు రక్షణ కరువైంది. వైద్య రంగం పడకేసింది. విద్యా వ్యవస్థను నాశనం చేశారు.. నాడు, నేడు పేరుతో రూ.5 వేల కోట్లు దిగమింగారు. 30 లక్షలు ఇల్లు కడతానని చెప్పి...3 ఇల్లు కూడా కట్టలేదు. మద్యపాన నిషేధం అని చెప్పి..ఎక్కడా లేని బ్రాండ్లు ఏపీలో ఉన్నాయి. చంద్రబాబు హయాంలో ఐటీ ఉద్యోగాలు ఇస్తే..జగన్ హయాంలో వలంటీర్ ఉద్యోగులు ఇచ్చారు. టీడీపీ, ప్రతిపక్షాలు ఆందోళన చేస్తే..ఎమ్మెల్సీ అంతబాబును అరెస్ట్ చేశారు.’’ అని అచ్చెన్నాయుడు చెప్పారు.  

Updated Date - 2022-05-31T00:34:39+05:30 IST