సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు

ABN , First Publish Date - 2022-06-30T05:19:35+05:30 IST

జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు అన్నారు.

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు
నిల్వఉన్న నీటిని పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో

- డీఎంహెచ్‌వో సుమన్‌మోహన్‌రావు

ఎల్లారెడ్డిపేట, జూన్‌ 29: జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌ గ్రామాన్ని బుధవారం ఆయన సందర్శించారు. వార్డుల్లోని పలు ఇంటి పరసరాలను పరిశీలించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఇంటిలోని నీటి కుండిల్లో నీరు నిల్వ ఉండడం వల్ల వృద్ధి చెందిన లార్వాను గుర్తించారు. జిల్లాలో హైరిస్కు గ్రామాలను గుర్తించి ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులతో కలిసి పారిశుధ్య పనులు చేపడుతున్నామని అన్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రైడేను నిర్వహిస్తున్నామని అన్నారు. నిత్యం వైద్య సిబ్బంది 30 నుంచి 40 ఇళ్లను సందర్శించి శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం డెంగీ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్పించిందని అన్నారు. జ్వర లక్షణాలు ఉన్న వ్యక్తులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాలని వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు సూచించారు. ఆయన వెంట సర్పంచ్‌ బాల్‌రెడ్డి, మండల వైద్యాధికారి ధర్మానాయక్‌, హెచ్‌ఈవోలు లింగం, శ్రీనివాస్‌, వైద్య సిబ్బంది ఉన్నారు.


Updated Date - 2022-06-30T05:19:35+05:30 IST