సీజనల్‌ వ్యాధుల నివారణపై ముందస్తు చర్యలు తీసుకోవాలి

Jun 15 2021 @ 00:17AM
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, జూన్‌ 14 : సీజనల్‌ వ్యాధుల నివారణ, శానిటేషన్‌, హరిత హారంపై ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు. సోమవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో సీజనల్‌ వ్యాధులు, కీటక జనిత వ్యాధుల నివారణ నియంత్రణపై జిల్లా కలెక్టర్‌ ఆధ్వ ర్యంలో జిల్లా కో-ఆర్డినేషన్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూఖీ మాట్లాడుతూ.. వచ్చేది వర్షా కాలం కాబట్టి కీటక జనిత వ్యాధులు, ఇతర సీజనల్‌ వ్యాధులు వ్యాపించే అవ కాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి వ్యాధు ల వ్యాప్తిని అరికట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణాలలో మురికి కాలువల్లో పూడిక వెంటనే తీసివేయాలని, అదే విధంగా నీరు నిల్వ లేకుండా చూడాలని, మంచి నీటిని సరఫరా చేసే పైపుల్లో ఏమైనా లీకేజీలు ఉంటే వాటిని వెంటనే మరమ్మతులు చేయాలని, అదే విధంగా సమయానుసారంగా తాగునీటిని ఎప్పటికప్పుడు క్లోరినే షన్‌ చేసి సరఫరా చేయాలని, వ్యాధులు వ్యాప్తి చెంద కుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, వైద్యసిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నా రు. ఈ కమిటీలో వైద్యాధికారి, డీపీవో, ఆర్‌డబ్ల్యూఎస్‌, మున్సిపల్‌ కమిషనర్‌, డీపీఆర్‌వో, విద్యాధికారి ఉంటారని అన్నారు. హరితహారం శానిటేషన్‌లలో డీపీవో, డీఎల్పీ వో, ఎంపీడీవోలు గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాలని, గ్రామాలలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని, పిచ్చి మొక్కలు, గడ్డిని రెండురోజుల్లో తొలగించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్‌ సీఈవో సుధీర్‌కుమార్‌, డీఆర్‌డీవో పీడీ వెంకటే శ్వర్లు, నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌లు, వైద్యాధికారులు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on: