12 గంటల ముందే దినుసులు.. 45 నిమిషాల ముందే మరొకరు తినాల్సిందే.. రాష్ట్రపతికి ఇచ్చే ఆహారం విషయంలో జాగ్రత్తలేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-10-20T07:38:33+05:30 IST

అక్టోబర్‌ 20న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ బిహార్ వెళ్లనున్నారు. 22వ తేదీ వరకు రాజధాని పట్నాలో ఉండబోతున్నారు ఆయన అక్కడ 45 గంటల 15 నిముషాలు..

12 గంటల ముందే దినుసులు.. 45 నిమిషాల ముందే మరొకరు తినాల్సిందే.. రాష్ట్రపతికి ఇచ్చే ఆహారం విషయంలో జాగ్రత్తలేంటో తెలిస్తే..

అక్టోబర్‌ 20న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ బిహార్ వెళ్లనున్నారు. 22వ తేదీ వరకు రాజధాని పట్నాలో ఉండబోతున్నారు ఆయన అక్కడ 45 గంటల 15 నిముషాలు ఉంటారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రపతికి ఎలా స్వాగతం చెప్పాలి..? ఆయన ఎక్కడ ఉండాలి..? ఏ ఆహారం తీసుకోవాలి..? వంటి అనేక విషయాలపై అధికాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతికి అందించే ఆహారానికి సంబంధించి భద్రత చర్యలు తీసుకోవడానికి నలుగురు ఫుడ్ సేఫ్టీ అధికారులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీరు రాష్ట్రపతికి, ఆయన భార్యకు అందించే ఆహారాన్ని తనిఖీ చేసి అందిస్తారు.


నలుగురు అధికారులతో ఆహారంపై నిఘా..

పట్నా అడిషనల్ డిప్యూటీ సూపరింటెండెంట్, అసిస్టెంట్ అడిషనల్ చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ రజనీశ్ చౌధరితో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారి అజయ్ కుమార్‌ ఎయిర్‌పోర్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బిహార్ విధాన సభ చేరుకునే వరకు దేశ్ రత్న మార్గం, పాట్నా హనుమాన్ మందిర్‌ల వద్ద అజయ్ కుమార్ రాష్ట్రపతి దంపతుల ఆహార పదార్థాలపై నిఘా ఉంచుతారు. మధ్యలో రాజ్‌భవన్‌ నందు రాజ్‌భవన్ స్టేట్ మెడిసిన్ మెడికల్ అధికారి డాక్టర్ జతీంద్ర మోహన్ సింగ్ ఆహార బాధ్యతలను పర్యవేక్షిస్తారు. అలాగే గురు గోవింద్ సింగ్ సర్దార్ హాస్పిటర్ డాక్టర్ చంద్ర మణి మిశ్రాను కూడా రాష్ట్రపతి ఆహారాన్ని తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేశారు.


12 గంటల ముందే ఆహార దినుసులు..

వీవీఐపీలకు ఆహారం అందించేందుకు 12 గంటల ముందే ఆహార దినుసులు తీసుకువస్తారు. వీటిని తనిఖీ చేయడానికి కూడా ఆహార భద్రత అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో డాక్టర్లు కూడా ఉంటారు. ప్రతి క్షణం వీవీఐపీలకు ఎలాంటి ఆహారం ఇస్తున్నారు..? ఎలాంటి పానీయాలను అందిస్తున్నారు..? అనే విషయాలపై నిఘా ఉంచాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఆహార దినుసులను 12 గంటల ముందే తీసుకొచ్చి వాటిని సంపూర్ణంగా పరిశీలించి ఆ తర్వాత వాటిని వండేందుకు అధికారులు సర్టిఫికేట్ ఇస్తారు.


అదే విధంగా ఆహారం తయారైన తర్వాత కూడా అధికారులు ఆ ఆహారాన్ని 45 నిముషాల ముందే పరిశీలించి ఆహారంలో ఎలాంటి సమస్యా లేకపోతే ఓ సర్టిఫికేట్ విడుదల చేస్తారు. ఆ తర్వాత ఆహారంతో నిండిన ప్లేట్ వీవీఐపీ ముందుకు చేరుతుంది. పాట్నా రాబోతున్నా రాష్ట్రపతికి కూడా ఇలాంటి అన్ని రకాల భద్రతలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Updated Date - 2021-10-20T07:38:33+05:30 IST