ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-01-26T05:55:36+05:30 IST

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కు ఎంతో ప్రాధాన్యం ఉందని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు అన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ప్రాధాన్యం
ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌, అధికారులు

-  18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటరుగా నమోదు 

చేసుకోవాలి 8 12వ జాతీయ ఓటర్ల దినోత్సవంలో కలెక్టర్‌ 


మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), జనవరి 25 : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కు ఎంతో ప్రాధాన్యం ఉందని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు అన్నారు. పరిపాలనద క్షులను ఎన్నుకోవడంలో ఓటు వజ్రాయుధంగా ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు. మంగళవారం 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించు కొని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 18 సంవత్సరా లు నిండిన యువతి, యువకులు అందరు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు అనే వజ్రాయుధాన్ని సరిగా వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వా మ్యం ఫరిడవిల్లుతుందన్నారు. మంచివారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే మంచి శాసనాలు వస్తాయని, 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొని ఓటువేయాలని తెలిపారు. పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎల్‌. బి. లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ మాట్లాడుతూ అతి పెద్ద ప్రజాస్వామ్య మైన భారతదేశంలో ఓటుకు ఎంతో విలువ ఉందని వివరించారు. ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఎన్నికల సంఘం ఇటీవల కాలంలో ఈ-పోర్టల్‌ ద్వారా ఇంట్లోనే ఉండి ఓటర్‌గా నమోదు చేసుకోవడమే కాకుండా ఓటరు కార్డును కూడా ఇంటికే వచ్చేలా అవకాశం కల్పించిందని తెలిపారు. అంతకు మందు మహ బూబ్‌నగర్‌ అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్‌ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త ఓటర్లుగా నమోదైన వారికి ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను అందజేశారు. అంతేకాకా సీనియర్‌ సిటిజన్లను సన్మానించారు. దీంతో పాటు ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ పద్మశ్రీ, డీఈవో ఉషారాణి, కలెక్టరేట్‌ కార్యాలయం, అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T05:55:36+05:30 IST