పరీక్ష కోసం స్కూటర్‌పై 1200కిమీలు.. శభాష్ అంటూ విమానం టికెట్స్

ABN , First Publish Date - 2020-09-07T17:52:08+05:30 IST

పరీక్ష రాయడం కోసం ఓ గర్భవతి 1200కిమీలపైగా స్కూటీపై ప్రయాణించింది.

పరీక్ష కోసం స్కూటర్‌పై 1200కిమీలు.. శభాష్ అంటూ విమానం టికెట్స్

భోపాల్: పరీక్ష రాయడం కోసం ఓ గర్భవతి 1200కిమీలపైగా స్కూటర్‌పై ప్రయాణించింది. జార్ఖండ్‌కు చెందిన ధనంజయ్ కుమార్(27) భార్య సోని హెంబ్రామ్(22) భార్యాభర్తలు. సోనీకి టీచర్ అవ్వాలని కోరిక. దీనికోసం నిర్వహించే డీఈడీ(డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) పరీక్షకు దరఖాస్తు చేసుకుంది. అయితే పరీక్ష కేంద్రం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్. భార్యను ఎలాగైనా పరీక్ష రాయించాలని నిర్ణయించుకున్న ధనంజయ్.. తన స్కూటర్‌పై గర్భవతి అయిన ఆమెను ఎక్కించుకొని, 1200కిమీలు ప్రయాణించాడు. చివరకు ఆమె చేత పరీక్ష రాయించాడు.


ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న అదానీ ఫౌండేషన్ ఈ దంపతులను కొనియాడింది. ‘వీరి ప్రయాణం పట్టుదల, ఆశయాలతో కలబోత. ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చినందుకు స్థానిక మీడియాకు కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేసింది. ధనంజయ్ దంపతులు సౌకర్యవంతంగా స్వరాష్ట్రం వెళ్లేందుకు విమానం టికెట్స్ బుక్ చేసినట్లు తెలిపింది.

Updated Date - 2020-09-07T17:52:08+05:30 IST