USA news: దారుణ రోడ్డు ప్రమాదం.. గర్భవతి సహా ఐదుగురి దుర్మరణం!

ABN , First Publish Date - 2022-08-07T03:49:55+05:30 IST

అమెరికాలోని లాస్‌ఏంజిలిస్ నగరంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో(Accident) ఓ గర్భవతి, ఆమె కుమారుడు(1) సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

USA news:  దారుణ రోడ్డు ప్రమాదం.. గర్భవతి సహా ఐదుగురి దుర్మరణం!

ఎన్నారై డెస్క్: అమెరికాలోని లాస్‌ఏంజిలిస్ నగరంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో(Accident) ఓ గర్భవతి, ఆమె కుమారుడు(1) సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మధ్యాహ్నం సమయంలో విండ్సర్ హిల్స్ ప్రాంతం వద్ద నాలుగు రోడ్ల కూడలిలో ఈ దారుణం జరిగింది. కూడలివైపు వేగంగా దూసుకొచ్చిన కారు.. ముందున్న వాహనాలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఓ నర్సు తన మెర్సిడీజ్ కారుతో ఎదురుగా వెళుతున్న వాహనాలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో చిక్కుకుని రెండు కార్లు బూడిదయ్యాయి.  


అయితే.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను రక్షించారు.  ఈ ప్రమాదానికి కారణమైన నికోల్ లింటన్‌(37)ను పోలీసులు అరెస్టు చేశారు. వాహన రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో లింటన్ తన కారు వేగంగా నడి ప్రమాదానికి కారణమయ్యిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు. విచారణలో తమకు పూర్తిగా సహకరిస్తోందని అన్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో గర్భంతో ఉన్న యువతి కూడా ఉంది. యువతి వెంట ఆమె కుమారుడు(1), బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నారు. డాక్టర్ చెకప్ కోసం వెళుతుండగా ఇలా అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయందని స్థానిక మీడియా తెలిపింది.



Updated Date - 2022-08-07T03:49:55+05:30 IST