హోటల్‌లో జాబ్స్‌ అంటూ ఫోన్‌కాల్స్.. నిజమని నమ్మి గర్భవతి అయిన భార్యను పంపించాడో భర్త.. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-02T23:49:14+05:30 IST

బీహార్‌లోని జముయ్‌లో నివసిస్తున్న ఆ జంటకు ముగ్గురు పిల్లలు.. భార్య నాలుగోసారి గర్భం దాల్చింది..

హోటల్‌లో జాబ్స్‌ అంటూ ఫోన్‌కాల్స్.. నిజమని నమ్మి గర్భవతి అయిన భార్యను పంపించాడో భర్త.. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే..

బీహార్‌లోని జముయ్‌లో నివసిస్తున్న ఆ జంటకు ముగ్గురు పిల్లలు.. భార్య నాలుగోసారి గర్భం దాల్చింది.. హోటల్‌లో జాబ్స్ ఉన్నాయంటూ గత ఏప్రిల్‌లో వారికి తరచుగా ఫోన్ కాల్స్ వచ్చాయి.. పహర్‌గంజ్‌లో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జాబ్ చేయడానికి రావాలని అడిగారు.. నిజమని నమ్మిన భర్త గర్భవతి అయిన తన భార్యను పంపించాడు.. జముయ్ చేరిన భార్య మొదటి రెండ్రోజులు భర్తకు ఫోన్ చేసి మాట్లాడింది.. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది.. పది రోజుల తర్వాత `నన్ను ఓ గదిలో బందీగా ఉంచారు.. నాతో పాటు మరో 10 మందిని ఒమన్‌ తీసుకొచ్చారు` అని వాయిస్ మెసేజ్ వచ్చింది.. అది విన్న భర్త పోలీసులను ఆశ్రయించాడు. 


ఇది కూడా చదవండి..

పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఒంటరిగా పుట్టింటికి.. కన్నీళ్లతో ఆ కూతురు చెప్పింది విని నివ్వెరపోయిన తల్లిదండ్రులు.. చివరకు..


జముయ్‌లో నివసిస్తున్న అక్తర్ అనే వ్యక్తి తన భార్య సన్నో సయీద్‌ను హోటల్‌లో జాబ్ కోసం ఏప్రిల్‌లో పహర్‌గంజ్ పంపించాడు. పహర్‌గంజ్ చేరుకున్న సన్నో ఆ తర్వాత ఢిల్లీకి అక్కడి నుంచి ఒమన్‌కు వెళ్లింది. ఆమెను ఎవరో కిడ్నాప్ చేసినట్టు వాయిస్ మెసేజ్ ద్వారా స్పష్టమవుతోంది. దీంతో అక్తర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు పట్టించుకోలేదు. దీంతో అతను ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఆ కేసు కోర్టు విచారణలో ఉంది. 


`మాకు ముగ్గురు పిల్లలు. కిడ్నాప్ అయిన నా భార్య గర్భంతో ఉంది. నా ముగ్గురు పిల్లలు తల్లి గురించి అడిగినప్పడల్లా ఏదో కారణం చెబుతున్నాను. మహిళలను కిడ్నాప్ చేసి అక్రమ రవాణా చేసే గ్యాంగ్ మమ్మల్ని ట్రాప్ చేసింది. రోజుకు ఒకసారే ఆహారం పెడుతున్నారని, మొత్తం 10 మంది మహిళలను ఒక గదిలో బంధించి ఉంచారని నా భార్య చెప్పింది. మమ్మల్ని జంతువుల్లా చూస్తున్నారని ఆమె వాయిస్ మెసేజ్‌లో చెప్పింద`ని అక్తర్ తెలిపాడు. 

Updated Date - 2022-07-02T23:49:14+05:30 IST