మంకీపాక్స్ బారిన పడ్డ గర్భవతి ప్రసవం.. ఆరోగ్యంగా శిశువు..

ABN , First Publish Date - 2022-07-29T02:29:26+05:30 IST

తాజా లెక్కల ప్రకారం.. 78 దేశాల్లో ఇప్పటివరకూ 18 వేల పైచిలుకు మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. అధికా శాతం కేసులు స్వలింగసంపర్కులైన పురుషుల్లోనే వెలుగు చూసినట్టు తెలిసింది. అయితే..ఈ వైరస్ ఇతర వర్గాలకు కూడా క్రమంగా పాకే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అమెరికా, స్పెయిన్, నెదర్‌ల్యాండ్స్ దేశాల్లో కొందరు చిన్నారులు ఈ వైరస్ బారిన పడ్డారు.

మంకీపాక్స్ బారిన పడ్డ గర్భవతి ప్రసవం.. ఆరోగ్యంగా శిశువు..

ఎన్నారై డెస్క్: అమెరికాలో మంకీపాక్స్(Monkeypox) బారిన పడ్డ ఓ గర్భవతి (Pregnant woman) ఇటీవలే ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా ఇద్దరూ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. అమెరికా అంటువ్యాధుల నిరోధక సంస్థ సీడీసీ తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. బిడ్డకు ముందు జాగ్రత్తగా ఐజీ-జీ యాంటీబాడీలను ఇచ్చినట్టు తెలిపింది. తల్లి నుంచి బిడ్డకు మంకీపాక్స్ వైరస్ వ్యాపించలేదని చెప్పింది.  కాగా.. అమెరికాలో ప్రగ్నెంట్ మహిళల ఈ వైరస్ బారిన పడటం ఇదేతొలిసారని తెలుస్తోంది. గతంలో ఆఫ్రీకా ఖండంలో కొందరు ప్రగ్నెంట్ మహిళలు మంకీపాక్స్ బారిన పడ్డారు. తదనంతం తల్లీ, బిడ్డా తీవ్రపరిణామాలు ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో గర్భవిచ్ఛతి జరగ్గా.. మరికొన్ని సందర్భాల్లో మృత శిశువు జన్మించింది. అయితే.. పెద్దలకు మంకీపాక్స్ కారణంగా ప్రమాదమేమీ ఉండదని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత కూడా ఓ మోస్తరుగానే ఉంటుందని అంటున్నారు. అయితే.. గర్భవతులపై ఈ వైరస్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై పూర్తి అవగాహన లేదు. 

తాజా లెక్కల ప్రకారం.. 78 దేశాల్లో ఇప్పటివరకూ 18 వేల పైచిలుకు మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. అధికా శాతం కేసులు స్వలింగసంపర్కులైన పురుషుల్లోనే వెలుగు చూసినట్టు తెలిసింది. అయితే..ఈ వైరస్ ఇతర వర్గాలకు కూడా క్రమంగా పాకే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అమెరికా, స్పెయిన్, నెదర్‌ల్యాండ్స్ దేశాల్లో కొందరు చిన్నారులు ఈ వైరస్ బారిన పడ్డారు. 

Updated Date - 2022-07-29T02:29:26+05:30 IST