ముందుగానే పుట్టేస్తున్న పిల్లలు... వాతావరణ మార్పులే కారణం!

ABN , First Publish Date - 2021-03-02T17:16:59+05:30 IST

ఈ తరం చిన్నారులు నెలల నిండకముందే...

ముందుగానే పుట్టేస్తున్న పిల్లలు... వాతావరణ మార్పులే కారణం!

లండన్: ఈ తరం చిన్నారులు నెలల నిండకముందే పుట్టేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పర్యావరణ మార్పులే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్‌కు చెందిన లాంకాస్టర్ యూనివర్శిటీ, ఫియోక్రజ్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో పలు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.


బ్రెజిల్‌లోని అమెజాన్ ప్రాంతంలో 2006 నుంచి 2017 మధ్యకాలంలో జన్మించిన మూడు లక్షల మంది చిన్నారులు డేటా ఆధారంగా ఈ అధ్యయనం చేశారు. వీరంతా పుట్టినప్పుడు తగినంత బరువు లేరు. దీనికి ఆ ప్రాంతంలో అధికశాతంలో కురిసిన వర్షపాతమే కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనితో పాటు కుటుంబాల్లోని ఆర్థిక, అనారోగ్య పరిస్థితులు కూడా కారణమని కనుగొన్నారు. ఈ ప్రాంతంలో భారీ వర్షపాతం కారణంగా వ్యాధులు సంక్రమిస్తుంటాయని, మరోవైపు వ్యవసాయ ఉత్పత్తులు తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే గర్భిణులు కూడా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని ఇవన్నీ కలిసి పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపిస్తాయని, వారు నెలలు నిండకముందే పుట్టేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అడవుల నరికివేత కారణంగా పర్యావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 

Updated Date - 2021-03-02T17:16:59+05:30 IST