అర్ధరాత్రి అకాల వర్షం

ABN , First Publish Date - 2022-05-26T06:59:55+05:30 IST

జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి ఈదురు గాలులు, ఉరు ములు, మెరుపులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. రాత్రి 10.30 గంటలకు ప్రారంభమై బుధవారం వేకువ జాము ఐదు గంటల వరకు కుండ పోతగా పడింది.

అర్ధరాత్రి అకాల వర్షం
బుచ్చెయ్యపేట మండలం వడ్డాఇలో భారీ వర్షానికి నీటమునిగిన వరి పనలు

    భయపెట్టిన ఉరుములు, మెరుపులు, పిడుగులు

  ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల నేలకొరిగిన స్తంభాలు, చెట్లు

 విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం.. అవస్థలు పడిన జనం

  తాటి చెట్టుపడి నీలకంఠాపురంలో పాడిగేదె మృత్యువాత

బుచ్చెయ్యపేట/ చోడవరం/ మాడుగుల రూరల్‌, మే 25 : జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి ఈదురు గాలులు, ఉరు ములు, మెరుపులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. రాత్రి 10.30 గంటలకు ప్రారంభమై బుధవారం వేకువ జాము ఐదు గంటల వరకు కుండ పోతగా పడింది. బుచ్చెయ్యపేటలో ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.పెద్దేరు, తాచేరు, బొడ్డేరు నదులు ఉధృతంగా ప్రవహించాయి. వడ్డాది, చినప్పన్నపాలెం, విజయరామరాజుపేట, బుచ్చెయ్యపేట, రాజాం తదితర గ్రామాల్లో పల్లపు ప్రాంతాలు నీటిముంపుకు గురైయ్యాయి. ఈదురు గాలులుకు పలు గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నెలకూలాయి. 16 గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వడ్డాది కస్పాలో శనివాడ అప్పారా వుకు చెందిన వరిపంటను కోసి ఉంచగా, అకాల వర్షానికి నీట మునగడంతో గగ్గోలు పెడుతున్నాడు. నీలకంఠాపురంలో కోరుకొండ తాతబ్బాయికి  చెందిన పాడి గేదెపై తాటిచెట్టు పడటంతో మృతి చెందింది. ఇలా చాలా ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది.  ఇదిలావుంటే చోడవరం మండలంలో మంగళవారం అర్ధరాత్రి తరువాత ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురవడంతో మండలంలో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్ప డింది. సుమారుగా రెండుగంటల సేపు గాలులతో  వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలు చోట్లచెట్ల కొమ్మలు విరిగి విద్యుత్‌ తీగలపై పడడంతో పట్టణంతో పాటు, గ్రామాల్లో కూడా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.  ప్రదాన రహదారిపై నీరు భారీగానే పారింది. అదేవిధంగా మండలంలో మంగళ వారం రాత్రి కుండపోత వర్షం పడింది. రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో హఠాత్తుగా వాతా వరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. తేలికపాటి గాలులు వీస్తూ చినుకులతో ప్రారంభమై ఏకధాటిగా సుమారు రెండు గంటల సేపు కుండపోత వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుండడంతో మండల ప్రజలు భీతిల్లారు.  విద్యుత్‌ సరఫరాలో అంత రాయం ఏర్పడింది. మంగళవారం రాత్రి పదకొండు గంటల నుంచి మరుసటి రోజు బుధవారం ఉదయం పదకొండు గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

Updated Date - 2022-05-26T06:59:55+05:30 IST