అకాల వర్షం.. తడిసిన ధాన్యం

ABN , First Publish Date - 2022-05-21T04:44:12+05:30 IST

రెండురోజు లుగా కురుస్తున్న వర్షం అన్న దాతలను అతలాకుతలం చే స్తోంది.

అకాల వర్షం.. తడిసిన ధాన్యం
వెన్నచేడు ధాన్యం కొనుగోలు కేంద్రంలో వర్షపు నీటిలో వరి


గండీడ్‌, మే 20: రెండురోజు లుగా కురుస్తున్న వర్షం అన్న దాతలను అతలాకుతలం చే స్తోంది. శుక్రవారం సాయంత్రం గండీడ్‌ మండల వ్యాప్తంగా  కురిసిన భారీ వర్షానికి మం డలంలోని కొంరెడ్డిపల్లి, గండీడ్‌, సల్కర్‌పేట, రంగారెడ్డిపల్లి, వెన్నచేడు తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వడ్లు పూర్తిగా తడిసి ముద్ద య్యాయి. ఇంకా కొన్ని గ్రామా ల్లో కల్లాల్లోని ధాన్యం పూర్తిగా తడిచింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులను  ఎదుర్కొంటున్నారు. 

 కుప్పలు వేస్తుండగానే వర్షం.. 

మహమ్మదాబాద్‌ : మండల పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం గంటపాటు వర్షం కురిసింది. కల్లాల్లోని ధాన్యాన్ని కుప్పలు వేస్తుండగానే వర్షం రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రంతో పాటు, గాదిర్యాల్‌, మంగపేట, మొకర్లాబాద్‌, నంచర్ల తదితర గ్రా మాల్లో వర్షం కురవడంతో ఆరబోసిన ధాన్యంతో పాటు, వరి కుప్పల చుట్టూ నీరు చేరడంతో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో అలసత్వం వహించకుండా త్వరితగతిన కొనుగోలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-05-21T04:44:12+05:30 IST