ప్రేమోన్మాది సునీల్‌కుమార్‌ అరెస్టు : డీఎస్పీ

ABN , First Publish Date - 2021-01-24T05:08:25+05:30 IST

ప్రేమించలేదన్న అక్కసుతో ప్రేమించిన టీనేజ్‌ యువతిని అతిదారుణంగా మచ్చుకత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ప్రేమోన్మాది సునీల్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ వై.ప్రసాద్‌రావు వెల్లడించారు.

ప్రేమోన్మాది సునీల్‌కుమార్‌ అరెస్టు : డీఎస్పీ
అరెస్టు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రసాదరావు

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 23: ప్రేమించలేదన్న అక్కసుతో ప్రేమించిన టీనేజ్‌ యువతిని అతిదారుణంగా మచ్చుకత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ప్రేమోన్మాది సునీల్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ వై.ప్రసాద్‌రావు వెల్లడించారు.

శనివారం డీఎస్పీ కార్యాలయ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ  మాట్లాడుతూ వివేకానందనగర్‌ వాసి సునీల్‌కుమార్‌ నేతాజీనగర్‌కు చెందిన లావణ్య ను మూడు నెలలుగా ప్రేమిస్తున్నానంటూ వెంబడించేవాడు. ఈ క్రమంలో ఆ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుపై సునీల్‌కుమార్‌ను పోలీ్‌సస్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారన్నారు.

అయినా కూడా శుక్రవారం ఇంట్లో ఒంటరిగా వున్న లావణ్యపై మచ్చుకత్తితో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాడన్నారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి భారతి ఫిర్యాదుపై సునీల్‌పై దిశ, ఫోక్సో, హత్యాయత్నం కేసులు నమోదు చేశామన్నా రు.

వన్‌టౌన్‌ సీఐ నాగరాజు, ఎస్‌ఐ శివశంకర్‌ నేతృత్వంలో కానిస్టేబుల్‌ బాబాఫకృద్దీన్‌ కేసును చేధించడంతో డీఎస్పీ అభినందించారు. నిందితుడు సునీల్‌కుమార్‌ను కోర్టులో హాజరుపరచగా, మెజిసే్ట్రట్‌ రిమాండుకు అదేశించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ నాగరాజు, ఎస్‌ఐలు శివశంకర్‌, రాజారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-24T05:08:25+05:30 IST