ఇక బహు వార్షిక పశుగ్రాసాలు

ABN , First Publish Date - 2021-05-05T05:21:29+05:30 IST

పశుగ్రాసంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఎన్‌ఈఆర్‌ఈజీఎస్‌ పథకంలో భాగంగా పశుగ్రాసాలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. పశుగ్రాసం పెంచేందుకు వరుసగా మూడేళ్లపాటు రైతులకు ఎకరాకు రూ.18 వేలు చొప్పున వివిధ రూపాల్లో ప్రోత్సాహకం అందించనుంది. చిన్న రైతులకు సైతం ఈ పథకంలో చేర్చింది.

ఇక బహు వార్షిక పశుగ్రాసాలు
బహువార్షిక పశుగ్రాసం రకాలు.





వరుసగా మూడేళ్ల పాటు గడ్డి పెంపకానికి సన్నాహాలు

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా రైతులకు ప్రోత్సాహకం

(టెక్కలి)

పశుగ్రాసంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఎన్‌ఈఆర్‌ఈజీఎస్‌ పథకంలో భాగంగా పశుగ్రాసాలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. పశుగ్రాసం పెంచేందుకు వరుసగా మూడేళ్లపాటు  రైతులకు  ఎకరాకు రూ.18 వేలు చొప్పున వివిధ రూపాల్లో ప్రోత్సాహకం అందించనుంది. చిన్న రైతులకు సైతం ఈ పథకంలో చేర్చింది. పశుగ్రాసాల పెంపుతో పాటు రైతులకు నేరుగా ఉపాధి పనులు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో 1,500 ఎకరాల్లో బహు వార్షిక పశుగ్రాసాలు పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం గ్రామాల్లో పశుగ్రాసం కొరత వేధిస్తోంది. గతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించేవి. పొలాల్లో పచ్చగడ్డి లభ్యమయ్యేది. ఇప్పుడు పశుగ్రాసం దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది రైతులు పశువులను విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పశువుల పెంపకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా పాడి రైతుకు ఒక్కో ఆవు చొప్పున అందించాలన్న ప్రతిపాదన సైతం ఉంది. ఈ నేపథ్యంలో బహు వార్షిక పశుగ్రాసాల పెంపకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయిలో రైతుల ఎంపిక బాధ్యతను గ్రామ సచివాలయ పశుసంవర్థక సహాయకులు, గోపాలమిత్రలకు అప్పగించింది. వారు క్షేత్రస్థాయిలో రైతుల పొలాలను పరిశీలించి వివరాలను నమోదు చేయనున్నారు. నీటి లభ్యత ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యమివ్వనున్నారు. ఈ విషయమై పశు సంవర్థకశాఖ డీడీ డాక్టర్‌ జయరాజ్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా, శ్రీకాకుళం, టెక్కలి డివిజన్లలో 750 ఎకరాలు చొప్పున బహువార్షిక పశుగ్రాసాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాడి రైతులకు ఇది ఎంతో ప్రయోజనం. పశుగ్రాసంతో పాటు ఉపాధి పనులు వారికి లభించనున్నట్టు ఆయన వెల్లడించారు.  



Updated Date - 2021-05-05T05:21:29+05:30 IST