కందుల కొనుగోలుకు సన్నాహాలు

ABN , First Publish Date - 2021-01-13T05:17:08+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కందిపంట చేతి రావడంతో అధికారులు కొనుగోళ్లకు సన్నాహాలు చే స్తున్నారు. ఇప్పటికే మార్క్‌ఫెడ్‌, వ్యవసాయ, మార్కె టింగ్‌ శాఖ అధికారులతో ఉన్నతాధికారులు సమావే శం నిర్వహించారు.

కందుల కొనుగోలుకు సన్నాహాలు

ఉమ్మడి జిల్లాలో 14 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారుల కసరత్తు

40 వేల ఎకరాలలో కందిపంట సాగు

27 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా

ఉభయ జిల్లాల్లో 2 వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకే అనుమతి

అదనపు కొనుగోళ్లకు ప్రభుత్వానికి మార్క్‌ఫెడ్‌ అధికారుల లేఖ

కామారెడ్డి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కందిపంట చేతి రావడంతో అధికారులు కొనుగోళ్లకు సన్నాహాలు చే స్తున్నారు. ఇప్పటికే మార్క్‌ఫెడ్‌, వ్యవసాయ, మార్కె టింగ్‌ శాఖ అధికారులతో ఉన్నతాధికారులు సమావే శం నిర్వహించారు. సంక్రాంతి తర్వాత కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. నియంత్రి త సాగు విధానంతో ఉమ్మడి జిల్లా రైతులు కంది పంటను విస్తారంగానే సాగు చేశారు. దీంతో దిగుబ డి కూడా పెరిగే అవకాశం ఉంది. ఇందుకు అనుగు ణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని నిర్ణ యించారు. కంది పంట కొనుగోలుకు ప్రభుత్వాలు సైతం ఆదేశాలు ఇచ్చాయి. అయితే, ఉమ్మడి జిల్లాలో పంటసాగు లెక్కన 27 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబ డి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ ప్ర భుత్వం మాత్రం 2 వేల మెట్రిక్‌ టన్నుల కందుల కొ నుగోలుకు మాత్రమే అనుమతి ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో అదనపు కొనుగోలుకు అనుమతులు ఇవ్వాలని మార్క్‌ఫెడ్‌ అధికారు లు ప్రభుత్వానికి లేఖ రాసి నట్లు తెలిసింది.

ఉమ్మడి జిల్లాలో 40 వేల ఎకరాలలో సాగు

నియంత్రిత సాగు విధా నంలో భాగంగా వానాకాలం సీజన్‌లో నిజామాబాద్‌, కా మారెడ్డి జిల్లాల్లో కందిసాగు విస్తీర్ణం చాలానే పెరిగింది. 2019లో సుమారు 29 వేల ఎకరాలలో పంట సాగు కా గా.. ఈ ఏడాది 40 వేల ఎక రాలలో కంది సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షాలు కురవడంతో కంది పంట ఆశాజనకంగా వచ్చింది. దీంతో దిగుబడి అంచనా కూడా పెరిగింది. నిజామాబాద్‌ జిల్లాలో బోధన్‌, వర్ని, నవీ పేట, రెంజల్‌, ఆర్మూర్‌, నందిపేట, మోపాల్‌, ధర్పల్లి, సిరికొండ తదితర మండలాల్లో, కామారెడ్డి జిల్లాలో జుక్కల్‌, మద్నూర్‌, పిట్లం, బిచ్కుంద, గాంధా రి, సదాశివనగర్‌, తాడ్వాయి, రాజంపేట మండలాలల్లో సాగు చేస్తుంటా రు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 27 వేల మెట్రిక్‌ టన్నుల కందు ల దిగుబడి వస్తుందని అధికారు లు పేర్కొంటున్నారు.

2 వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు మాత్రమే అనుమతి

ఉమ్మడి జిల్లాలో కందుల కొనుగోలుపై ప్రభుత్వం పరిమితి విధించింది. దిగుబడి అంచనాకు అనుగుణంగా కొనుగోళ్లు చేపట్ట డం లేదు. ఉభయ జిల్లాల్లో రెం డు వేల మెట్రిక్‌ టన్నుల కందు ల కొనుగోలుకు మాత్రమే ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అనుమతి ఇచ్చింది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా ల్లో సుమారు 40 వేల ఎకరాలలో కందిపంట సాగైం ది. దీంతో 27 వేల మెట్రిక్‌ టన్నుల కందుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వే శారు. కానీ ప్రభుత్వ నుంచి జిల్లాలో కేవలం 2 వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు మాత్రమే అనుమతు లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రై తులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది కూ డా కందులు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్డెక్కి ఆం దోళనలు చేసిన సంఘటనలు ఉన్నాయి. గత అనుభ వాలను దృష్టిలో ఉంచుకుని మార్క్‌ఫెడ్‌ అధికారులు ఉమ్మడి జిల్లాలో మరో 15 వేల మెట్రిక్‌ టన్నుల కం దుల కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు మార్క్‌ఫెడ్‌ అధికారులు ప్రభుత్వానిక లేఖ రాసినట్లు తెలిసింది. అయితే ప్ర భుత్వం ఎంతమేర అనుమతి ఇస్తుందో చూడాలి.

14 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో కందుల కొను గోలుకు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆయా శా ఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.6 వేల మద్దతు ధరను ప్రకటించిం ది. ఈ మద్దతు ధరతోనే జిల్లాలో ఏర్పాటుచేసే కేం ద్రాలలో కందులను కొనుగోలు చేయనున్నారు. గత ఏడాది మార్క్‌ఫెడ్‌, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సారి మాత్రం డీసీఎంఎస్‌ను తప్పించి మార్క్‌యార్డులతో పాటు పీఏసీఎస్‌లకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 కేంద్రాలు ఏర్పాటు చే సేందుకు కసరత్తు చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా లో 4 కేంద్రాలు, కామారెడ్డి జిల్లాలో 10 కేంద్రాలు ఏ ర్పాటుచేయాలని నిర్ణయించారు.

త్వరలోనే కేంద్రాలను ప్రారంభిస్తాం

రంజిత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా మార్క్‌ఫెడ్‌ అధికారి

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో త్వరలోనే కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. ఇప్పటికే ప్రభు త్వాలు సైతం కందుల కొనుగోలుకు అనుమతి ఇచ్చా యి. ఈ యేడు 2 వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జిల్లాలో దిగుబడి ఎ క్కువగా వచ్చే అవకాశం ఉన్నందున అదనంగా కం దుల సేకరణకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వా న్ని కోరాం. రెండు జిల్లాల్లో 14 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తాం.

Updated Date - 2021-01-13T05:17:08+05:30 IST