సున్నా వడ్డీ రుణ మంజూరుకు సన్నాహాలు

ABN , First Publish Date - 2021-02-26T05:00:18+05:30 IST

జిల్లాలో స్వయం సహాయక సంఘ మహిళలకు ‘సున్నా వడ్డీ’ ద్వారా రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

సున్నా వడ్డీ రుణ మంజూరుకు సన్నాహాలు

మార్చి నుంచి పథకం అమలుకు శ్రీకారం 

 553 గ్రూపుల్లో 5530 మంది సభ్యులు

ఎనహెచజీల వివరాల సేకరణలో సిబ్బంది

అట్లూరు, ఫిబ్రవరి 25: జిల్లాలో స్వయం సహాయక సంఘ మహిళలకు ‘సున్నా వడ్డీ’ ద్వారా రుణాలు మంజూరు చేసేందుకు  ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అర్హులైన ఎస్‌హెచజీ గ్రూపు సభ్యులకు మార్చి నుం చి రుణాలు మంజూరు చేసి చేయూత ని చ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీంతో అర్హుల వివరాలను సేకరించి ఆనలైనలో నమోదు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వైఎ్‌సఆర్‌ క్రాంతి పథం సిబ్బందిని ప్రభుత్వం ఆరేశించింది.


దీంతో ఉద్యోగులు సమాక్య సంఘాల వారీ వివరాలను సేకరిస్తున్నారు. వరికుంట, అట్లూరు, రెడ్డిపల్లి, కొండూరు, కుంభగిరి, తంభలగొంది, కమలకూ రు, మణ్యంవారిపల్లి, మాడుపూరు, కామసము ద్రం, వేమలూరు, ముత్తుకూరు పరిఽధిలో 553  ఎస్‌హెచజీ సంఘాల్లో 5530 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరికి ఇప్పటి వరకు బ్యాంకు అనుబంధ పథకం లో పావలా వడ్డీకి రుణాలను ప్రభుత్వం చెల్లించింది. వైసీపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా సున్నా వడ్డీకి రుణాలను 2021 -2022 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనుంది.


అర్హులైన  ఎస్‌హెచజీలను గుర్తించి ఆనలైనలో వివరాలను నమోదు చేస్తున్నారు. మార్చి నెలాఖరు లోపు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆయా సంఘాల బ్యాంకు ఖాతాలు పరిశీలించి  ఖాతాలు సరిపోక పోతే బ్యాంకు అఽధికారులతో మాట్లాడి సరి చేయించాల్సి ఉంటుం ది. కొవిడ్‌ సమయంలో రుణాలు పొందిన సంఘాల  వివరాలు, పొందని వాటిని కూడా ఆనలైనలో నమో దు చేయాలి. ఇందులో మండల ఏపీఎం పూర్తి గా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.


జిల్లా స్థాయిలో వైఎ్‌సఆర్‌ క్రాంతిపథం డీపీఎం 20 లోపు ఎస్‌హెచజీ వివరాలను పరిశీలించి ఆనలైనలో నమోదు చేయాలని గడువును ప్రభుత్వం నిర్ధేశించింది. దీంతో మండలా ల్లో  ఏపీఎంలు, యానిమేటర్లు పొదుపు సంఘా ల వారీ వివరాలను సేకరించి రుణా సమాచారాన్ని పరిశీలించి నమోదు చేస్తున్నారు. 2021 - 22లో ఎస్‌హెచజీలకు బ్యాం కులు ఇచ్చే రుణాలపై వడ్డీని ప్రభుత్వం భరించనుంది.

Updated Date - 2021-02-26T05:00:18+05:30 IST