వలంటీర్ల సన్మాన షెడ్యూల్‌ సిద్ధం చేయండి

Published: Mon, 28 Mar 2022 00:17:28 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వలంటీర్ల సన్మాన షెడ్యూల్‌ సిద్ధం చేయండి బల్లిపుట్టుగలో ఎంపీడీవోలతో మాట్లాడుతున్న విజయ


  జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ

కవిటి: గ్రామ వలంటీర్ల సేవలను గుర్తించి వారికి సన్మాన కార్యక్రమాల కోసం షెడ్యూల్‌ సిద్ధం చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ ఆదేశించారు. ఆదివారం బల్లిపుట్టుగలో నియోజవర్గంలోని నాలుగు మండలాల ఎంపీ డీవోలు, మునిసిపల్‌ కమిషనర్‌తో సమావేశం నిర్వహించారు. వలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర బిరుదులతో సత్కరించాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పి.సాయిరాజ్‌, సీడాప్‌ చైర్మన్‌ శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి  పాల్గొన్నారు.   కంచిలి: మండలంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకొని  పరిష్కారానికి  కృషి చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ తెలిపారు. కవిటి మండలంలోని బల్లిపుట్టగలో కంచిలి మండల ఎంపీటీసీలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు వలంటీర్లకు ప్రభుత్వం మంజూరు చేసిన అవార్డులను అందజేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ దేవాస్‌రెడ్డి, ఇప్పిలి కృష్ణారావు పాల్గొన్నారు. 


11111111111111111111111111111

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.