వానాకాలం సాగుకు కార్యాచరణ సిద్ధం

ABN , First Publish Date - 2022-05-24T05:18:36+05:30 IST

జిల్లాలో వానాకాలం పంటల సాగుకు వ్యవసాయాశాఖ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసింది.

వానాకాలం సాగుకు కార్యాచరణ సిద్ధం
లోగో

- విత్తనాలు ఎరువులను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు

- ఈ ఏడాది పెరుగనున్న పత్తి పంట

- జిల్లాలో 3.50లక్షల ఎకరాల్లో సాగు చేయవచ్చని అంచనా

- మరో 1.10లక్షల ఎకరాల్లో ఇతర పంటలు

- 6వేల ఎకరాల్లో చిరుధాన్యాల సాగుకు ప్రణాళిక 

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

జిల్లాలో వానాకాలం పంటల సాగుకు వ్యవసాయాశాఖ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ యేడాది రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలోనే వచ్చే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో జిల్లా వ్యవసా యాధికారులు పంటల సాగు ప్రణాళిక సిద్ధం చేశారు. ఊహించిన ట్టుగానే ఈ ఏడాది కూడా జిల్లాలో పత్తి పంటే అధిక విస్తీర్ణంలో సాగు చేయవచ్చని అధికారులు అంచనా వేశారు. గతేడాది 3.40లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేసినట్టు లెక్కలు తీశారు. ఈ సారి మరో పది వేల ఎకరాల సాగు పెరుగవచ్చని భావిస్తున్నారు. పత్తికి తోడు కంది, వరి, జొన్న, పెసర, మినుములు వంటి ఇతర పంటలను కూడా సాగు చేయవచ్చని అంచనా వేశారు. ఇందులో వరి సాధారణ విస్తీర్ణం 50వేల ఎకరాలు కాగా, ఈ సారి 55వేల ఎకరాల వరకు సాగు చేయ వచ్చని భావిస్తున్నారు. అలాగే కంది సాధారణ విస్తీర్ణం 50వేల ఎకరాలకు గాను ఈ సారి కూడా 50వేల ఎకరాల్లో సాగు చేయవచ్చని అంచన వేశారు. జొన్నపంటకు సంబంధించి 1000 ఎకరాలు, పెసర, మినుము వంటి పప్పు ధాన్యాల పంటు 2వేల ఎకరాల్లో సాగు చేయించేందుకు ప్రణాళి కలు సిద్ధం చేశారు. ఇవి కాకుండా ఆరువేల ఎకరాల్లో పోషకాహార పంటలైన చిరుధాన్యాల పంటలను సాగు చేసేందుకు ప్రత్యేకంగా చర్య లు చేపడుతున్నారు. ఇందుకు గాను వందశాతం సబ్సిడీపై రైతులకు 130 క్వింటాళ్ల చిరుధాన్యం విత్తనాలను పంపిణీ చేయనున్నారు. మొత్తం మీద ఈ ఏడాది జిల్లాలో ప్రధాన పంటకు 4.50లక్షల ఎకరాల్లో సాగు చేస్తారని భావిస్తున్నారు. ఇవి కాకుండా ఉద్యానవనశాఖ ద్వారా మరో 10 నుంచి 20 వేల ఎకరాల్లో వివిధ రకాల కూరగాయాల పంటలు సాగు అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా కాగజ్‌ నగర్‌, ఆసిఫాబాద్‌ పట్టణాలకు సమీపంలో ఉండే మండలాల్లో కూర గాయాల సాగును ప్రొత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొంది స్తున్నారు. జిల్లాలో పత్తి సాగుకు సంబంధించి యేటా అంచనాలకు మించి ఉంటున్న నేపథ్యంలో సీజన్‌ ప్రారంభమైన తర్వాత సాగు విస్తీర్ణం కాస్తా అటు ఇటుగా మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 

- సాగు పనులకు..

వానాకాలం పంటల సాగుకు సంబంధించి రైతులు పనులను ప్రా రంభించారు. దుక్కులు చేస్తూ తొలకరి వర్షానికే విత్తనాలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్ట పంటలను పక్కన పెడితే వరి సాగులో జీ లుగ పంటను నాటి రసాయన ఎరువుగా రైతాంగం ఉపయోగిస్తున్నది. దీంతో  ఈ యేడాది రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని 65 శాతం సబ్సిడీపై 221 క్వింటాళ్ల జిలుగ విత్తనాలను ప్రభుత్వం రైతులకు అందు బాటులోకి తెచ్చింది. ఇందులో ఒక్క క్వింటాకు 6,325 రూపాయలు ధరగా నిర్ణయించారు. ఇందులో 4,013 సబ్సిడీ 2,214 రూపాయలు రైతు వాటాగా నిర్ణయించారు. ఈ విత్తనాలను జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఉన్న ఆగ్రో సెంటర్లు, ప్రాథమిక సహకార సంఘాలు, సీసీ ఎం ఎస్‌ విక్రయ కేంద్రాల్లో అందు బాటులో ఉంచారు. జిలుగ విత్తనాలను కావాలనుకునే రైతాంగం సంబంధిత మండలాలకు చెందిన వ్యవసా యాధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొని కొనుగోలు కేంద్రాల్లో రాయితీపై ఈ విత్తనాలను పొందే వీలు కల్పించారు. 


- అవసరమైన ఎరువులు, విత్తనాలు..

వానాకాలం పంటల సాగుకు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందు కు జిల్లా వ్యవసాయ శాఖ కసరత్తు పూర్తి చేసింది. జిల్లాలో యూరియా, డీఏపీ, ఎరువుల వంటి అన్ని ఎరువులు కలుపుకొని 25, 211 టన్నుల అందు బాటులో ఉంచినట్టు చెబుతున్నారు. అయితే ఈ సీజన్‌లో మొత్తం 92 టన్నుల ఎరువులు అవసరం కావచ్చని అంచనా వేశారు. ఇందులో యూరియా 46 వేల టన్నులు, డీఏపీ 23వేల టన్నులు, పోటాష్‌ 23వేల టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 20వేల టన్నులు, సింగిల్‌ సూపర్‌ ఫాస్పెట్‌ 20వేల టన్నులు అవసరం కావచ్చని అంచనా వేశారు. కాగా ప్రస్తుతం యూరియా 22,119 టన్నులు, డీఏపీ 614 టన్నులు, పోటాష్‌ 141 టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 176 టన్నులు, పాస్పెట్‌ 629 టన్నులు అందుబాటులో ఉన్నాయని అలాగే పత్తి సాగుకు సంబంధించి మొత్తం 7 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం 4లక్షల విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో మొత్తం 295 ఫెర్టిలైజర్‌ షాపులుండగా, అన్ని దుకాణాల్లో విత్తనాలు అందుబాటులో ఉంచ నున్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని విత్తనాలను తెప్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.


బీటీ3 విత్తనాలు సాగు చేయొద్దు..

-శ్రీనివాస్‌ రావు, జిల్లా వ్యవసాయాశాఖ అధికారి

రైతాంగం అనుమతి లేని, హానికరమైన బీటీ3 విత్తనాలు సాగు చే యొద్దు. దీని వల్ల పర్యావరణ నష్టంతో పాటు భూముల సారం దెబ్బ తింటుంది. దిగుబడులు తగ్గి రైతు లు నష్టాల పాలవుతారు. ఈ విత్త నాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు ఏ విత్తనం కొనుగోలు చేసినా దుకాణాల నుంచి రశీదులు తప్పకుండా తీసుకొని భద్రపరుచుకోవాలి. విత్తనాల నాణ్య తలేని కారణంగా రైతులు పంటలు నష్టపోతే ఆ రశీదుల ఆధారంగా సదరు కంపెనీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైతులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. 

Updated Date - 2022-05-24T05:18:36+05:30 IST