కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-01-16T05:57:47+05:30 IST

ప్రపంచాన్ని అతలాకూతలం చేసిన కొవిడ్‌ మహమ్మారిని అదుపులో పెట ్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ప్రయత్నించాయి. పది నెల ల పాటు కృషి చేసి కొవిడ్‌ టీకాను అందుబాటులోకి తెచ్చాయి. శనివారం మొదటి విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభించనున్నారు.

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం
జిల్లా ఆస్పత్రిలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

- నేటి నుంచి పంపిణీ - జిల్లాలో 16 కేంద్రాల గుర్తింపు 

- నాలుగు కేంద్రాల్లో ప్రారంభం - తొలిరోజు 120 మందికి టీకా 

 - కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ప్రపంచాన్ని అతలాకూతలం చేసిన కొవిడ్‌ మహమ్మారిని అదుపులో పెట ్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ప్రయత్నించాయి.  పది నెల ల పాటు కృషి చేసి కొవిడ్‌ టీకాను అందుబాటులోకి తెచ్చాయి. శనివారం మొదటి విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభించనున్నారు. ఇందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 16 వ్యాక్సినేషన్‌ కేంద్రాలను గుర్తిం చారు. తొలి రోజు సిరిసిల్ల జిల్లా ప్రభుత్వాస్పత్రి, వేములవాడ, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ టీకా వేయనున్నారు. తొలి రోజు ప్రతీ కేంద్రంలో 30 మంది చొప్పున 120 మందికి టీకా ఇవ్వనున్నారు. తొలి టీకా పంపిణీలో మొదటగా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితోపాటు ప్రైవేటు డాక్టర్లు, అంగన్‌వాడీ సిబ్బంది ఉన్నారు. జిల్లాలో 3482 మంది వరకు టీకాల కోసం పేర్లను నమోదు  చేసుకున్నారు. జిల్లాకు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ 1280 డోసులకు సంబంధించి 128 వాయల్స్‌ వచ్చాయి. ఒక్క వాయల్‌లో పది డోసులు ఉంటాయి.  


టీకా ఇచ్చేది ఇలా... 

సిరిసిల్ల జిల్లా ప్రభుత్వాస్పత్రి, వేములవాడ, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట ప్ర భుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో  శనివారం  ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4వరకు టీకా వేస్తారు. మొదటి టీకా తీసుకున్నవారు అదే కేం ద్రంలో 28రోజుల తర్వాత రెండో టీకా తీసుకోవాలి. టీకా తీసుకున్న తర్వాత అరగంటపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. ఇబ్బంది కలిగితే సిరిసిల్ల, వేములవాడ ఆస్పత్రులకు తరలించడానికి అంబులెన్స్‌లను సిద్ధంగా ఉం చారు. కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌ మోహన్‌రావు వ్యాక్సినేషన్‌ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. శనివారం జడ్పీ చైర్‌ పర్సన్‌ అరుణ జిల్లా ఆస్పత్రిలో వ్యాక్సి నేషన్‌ను ప్రారంభించనున్నారు. 


కొవిడ్‌ టీకా పూర్తిగా సురక్షితం 

కొవిడ్‌ టీకా పూర్తిగా సురక్షితమైందని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు. శుక్ర వారం వేములవాడ, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, సిరిసిల్లలో కొవిడ్‌ వ్యాక్సి నేషన్‌ కేంద్రాలను పరిశీలించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో నాలుగు కేంద్రాల్లో వ్యాక్సిన్‌ వేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. టీకా వేసు కోవడానికి కేంద్రానికి వచ్చే వారు ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు. టీకా తీసుకున్న వారిలో దుష్ఫలితాలు కనిపిస్తే చికిత్స చేయడానికి ఏఈఎఫ్‌ఐ కిట్‌ అందుబాటులో ఉంచుకోవాలని డాక్టర్లకు సూచించారు. టీకా గురించి  అపోహలు వద్దన్నారు. టీకా ఎవరికీ బలవంతంగా ఇవ్వబోమన్నారు. 

Updated Date - 2021-01-16T05:57:47+05:30 IST