హరితహారానికి సిద్ధం

ABN , First Publish Date - 2022-05-26T06:19:53+05:30 IST

వర్షాలు కురవగానే ఎనిమిదో విడత హరితహా రం కింద మొక్కలు నాటేందుకు ఉమ్మడి జిల్లా యం త్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు, పట్టణాభివృద్ధి, అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కల పెంపకం ముమ్మరంగా సాగుతోంది.

హరితహారానికి సిద్ధం

వర్షాలు కురవగానే మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్న అధికారులు

1.81కోట్ల మొక్కలు నాటే లక్ష్యం

గ్రామానికో వన నర్సరీ


(ఆంధ్రజ్యోతి, యాదాద్రి,)/సూర్యాపేట సిటీ, నల్లగొండ: వర్షాలు కురవగానే ఎనిమిదో విడత హరితహా రం కింద మొక్కలు నాటేందుకు ఉమ్మడి జిల్లా యం త్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు, పట్టణాభివృద్ధి, అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కల పెంపకం ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం ఎండలు ఉండగా, మొక్కలు చనిపోకుండా ఉండేందుకు నర్సరీల్లో గ్రీన్‌మ్యాట్లు ఏర్పాటు చేశారు. నర్సరీల్లో పెరుగుతు న్న మొక్కల్లో 10శాతం చనిపోయినా, లక్ష్యానికి తగ్గకుండా ఉండేందుకు 15శాతం అదనంగా మొక్కల పెంపకం చేస్తున్నారు.



1.81కోట్ల మొక్కలు నాటే లక్ష్యం

ఉమ్మడి జిల్లాలో ఎనిమిదో విడత హరితహారంలో భాగంగా 1.81కోట్ల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యం గా నిర్ణయించారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలో 29.72 లక్షలు, నల్లగొండ జిల్లాలో 64.41లక్షలు, సూర్యాపేట జిల్లా లో 86లక్షలు మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధారించింది. ఉమ్మడి జిల్లాలో 1,740 పంచాయతీలు, 19 మునిసిపాలిటీలు ఉన్నాయి. పంచాయతీలతోపాటు, మునిసిపాలిటీల్లో విరివిగా మొక్కలు నాటేందుకు అధికారులు కార్యాచర ణ రూపొందించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రా మానికో నర్సరీని ఏర్పాటు చేశారు. యాదాద్రి జిల్లాలో మొత్తం 451 నర్సరీలు ఏర్పాటు చేశారు. వీటిలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 418 నర్సరీల్లో 49.11లక్షల మొక్క లు, అటవీశాఖ ఆధ్వర్యంలో 18 నర్సరీల్లో 17.98లక్షల మొక్కలు, మునిసిపల్‌శాఖ ఆధ్వర్యంలో 15 నర్సరీల్లో 5.01 లక్షల మొక్కలు పెంచుతున్నారు.


నీడనిచ్చే, పండ్లు, పూలమొక్కలకు ప్రాధాన్యం

హరితహారంలో ప్రధానంగా నీడనిచ్చే మొక్కలతో పాటు పండ్లు, పూల మొక్కలు నాటనున్నారు. టేకు, కానుగ, నేరేడు, ఈత, ఉసిరి, దానిమ్మ, నిమ్మ, జామ, బొప్పాయి, సీతాఫలం వంటి పండ్ల మొక్కలు, చెరువు కట్టలపై ఈత, ఖర్జూర, తుమ్మచెట్లు నాటనున్నారు. అదేవిధంగా ఇళ్లల్లో నాటేందుకు పలు రకాల పూల మొక్కలు పంపిణీ చేయనున్నారు. వీటిలో గులాబీ, గన్నేరు, చామంతి, మల్లెపూలు, తదితర మొక్కలు ఉండనున్నాయి. ఖాళీ ప్రదేశాలతో పాటు ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేట్‌ సంస్థలు, రోడ్డుకు ఇరువైపులా, ప్రతీ ఇంటివద్ద మొక్క నాటేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. అన్నిశాఖల అధికారులు హరితహారంలో భాగస్వామ్యులై మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామీణాభివృద్ధి, అటవీ, పంచాయతీరాజ్‌, ఉద్యానవన, ఇరిగేషన్‌, ఆబ్కారీ, వ్యవసాయ, విద్యా, పరిశ్రమలు తదితర శాఖల సమన్వయంతో నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వర్షాలు కురవగానే గ్రామాల వారీగా మొక్కలు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు సిబ్బందితో హరితహారంలో నాటాల్సిన మొక్కలపై సమీక్షంచి, స్థానిక సంస్థలు, పలు శాఖల సిబ్బంది సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.


గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేశాం : మందడి ఉపేందర్‌రెడ్డి, డీఆర్డీవో

హరితహారం కింద మొక్కలు నాటేందుకు ప్రతీ గ్రామంలో ఓ నర్సరీ ఏర్పాటుచేశాం. గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లాలో మొత్తం 418నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నాం. వీటితో పాటు ఆటవీశాఖ 18, మునిసిపల్‌శాఖ 15 నర్సరీలు ఏర్పాటుచేసింది. ప్రస్తుత ఏడాదిలో ప్రభుత్వం నిర్దేశించిన మేరకు నాటాల్సిన మొక్కలను ఈ నర్సరీల్లో పెంచుతున్నాం. వర్షాలు కురవగానే మొక్కలు పంపిణీ చేస్తాం. మొక్కలు నాటే లక్ష్యంపై ఇప్పటికే అన్ని శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాయి.


Updated Date - 2022-05-26T06:19:53+05:30 IST