ఖరీఫ్‌కు ప్రణాళికలు సిద్ధం

ABN , First Publish Date - 2022-05-20T04:53:04+05:30 IST

ఈఏడాది ఖరీఫ్‌లో చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్‌ అన్నారు. గురువారం స్థానిక మార్కెట్‌ కమిటీ కార్యాలయ ఆవరణలో వ్యవసాయాధికారులు, సలహా సంఘాలతో సమా వేశం నిర్వహించారు.

ఖరీఫ్‌కు ప్రణాళికలు సిద్ధం
మాట్లాడుతున్న జేడీఏ శ్రీధర్‌

వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్‌ 

నరసన్నపేట, మే 19: ఈఏడాది ఖరీఫ్‌లో చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేసినట్లు  వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్‌ అన్నారు. గురువారం స్థానిక మార్కెట్‌ కమిటీ కార్యాలయ ఆవరణలో వ్యవసాయాధికారులు, సలహా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే మృగశిర కార్తె నాటికి ఆర్బీకేల ద్వారా జిల్లాలో 41వేల క్వింటాళ్ల వరి విత్తనాలను పంపిణీ చేస్తామన్నారు. విత్తనాలు కావాల్సిన రైతులు ఆర్డీకేల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ ఏడాది సాంబ, సోనామసూరు, ఆర్‌ఎన్‌ఆర్‌లను పంపిణీ చేస్తామన్నారు. మార్టూరు 1318 రకం  నూతన వంగ డం స్వర్ణకు ప్రత్యామ్నాయంగా వచ్చిందన్నారు. 56 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు సిద్ధం చేశామన్నారు. జూన్‌ 6న జిల్లాలో మెగా రైతుమేళా నిర్వహిస్తున్నామన్నారు. జూన్‌ రెండో వారంలో సాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్య క్రమంలో జిల్లా రైతు సలహా మండలి అధ్యక్షుడు శిమ్మ నేతాజీ, ఏడీఏ రవీంద్రభారతి, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు. 


20 టన్నుల వరి విత్తనాల తయారీ

నందిగాం: నందిగాం మండలం బడబంద పరిధిలో నూత నంగా ఏర్పాటు చేస్తున్న విత్తనోత్పత్తి విత్తనశుద్ధి కేంద్రం ద్వారా 20వేల టన్నుల వరి విత్తనాలను తయారు చేయనున్నామని జేడీఏ  కె.శ్రీధర్‌ అన్నారు. గురువారం నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌, ఏపీ సీడ్స్‌ జిల్లా మేనేజర్‌ పి.బాలకృష్ణ, ఎంపీపీ నడుపూరు శ్రీరామ్మూర్తి, ఏడీఏ బీవీ తిరుమలరావు, ఏవో పి.శ్రీకాంత్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.  

 

Updated Date - 2022-05-20T04:53:04+05:30 IST