Advertisement

ఉత్పత్తుల ఎగుమతికి నివేదికలు తయారు చేయండి

Mar 5 2021 @ 23:25PM
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

నిజామాబాద్‌ అర్బన్‌, మార్చి 5: జిల్లాలో పారిశ్రామిక ఉత్పత్తులను విదేశాల కు ఎగుమతి చేయడానికి తీసుకోవాల్సిన చర్యల పై నివేదికలు అందించాలని కలెక్టర్‌ సీ.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో కేంద్ర ప్రభుత్వం కొ త్తగా అమలు చేయనున్న డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ డిస్ర్టిక్ట్‌ పొటెన్షియల్‌ ఎక్స్‌పోర్ట్‌ హబ్‌ పథకానికి సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ స మావేశాన్ని కలెక్టర్‌ చైర్మన్‌గా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో పసుపు, బియ్యం, విత్తనాలు, గ్రానైట్‌ బ్లాక్స్‌ తదితర ప్రధాన ఉత్పత్తులను వి దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా పారిశ్రామి క వేత్తలను, రైతులను ప్రోత్సహించడానికి ఈ పథకం రూపొందించిందన్నారు. ఇప్పటికే ఎగు మతి చేస్తున్న ఉత్పత్తుల వివరాలను, సాధ్యా సాధ్యాలను, ప్రయోజనాలను, సమస్యలను సం బంధిత ఎగుమతిదారుల నుంచి అన్ని వివరా లు సేకరించి ప్రోత్సహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సభ్యులు వివరాలు సేకరించి అందజేయాలన్నారు. తద్వారా కేంద్ర రాష్ట్ర ప్ర భుత్వాలు తదుపరి ఈ ఉత్పత్తులను ప్రోత్సహి ంచడానికి ఏ రకమైన సూచనలు, సలహాలు అ ందించాలో సవివరణమైన నివేదికలను సమర్పి ంచాలన్నారు. నివేదికల ఆధారంగా త్వరలో మ రొక సమావేశం ఏర్పాటుచేసి నివేదికలు సిద్ధం చేయడానికి వీలవుతుందని ప్రభుత్వానికి కూడా తదుపరి చర్యలు తీసుకోడానికి కోరతామన్నా రు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ బాబురావ్‌, కేంద్ర ప్రభుత్వ డి ప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ రిషికే ష్‌రెడ్డి, ఎల్‌డీఎం జయసంతోషి, జేడీఏ గోవింధ్‌, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్‌దాస్‌, రైస్‌ మిల్లర్లు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

రూ.237 తగ్గకుండా పని చేయండి 

నందిపేట: ఉపాధి హామీ కూలీలు.. కూలి రూ.237 తగ్గకుండా పనిచేయాలని కలెక్టర్‌ నా రాయణరెడ్డి సూచించారు. శుక్రవారం నందిపే ట మండలంలోని వెల్మల్‌ గ్రామంలో దేవుని చె రువులో చేస్తున్న ఉపాధి హామీ పనులను కలెక్ట ర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ పని చేస్తున్న 250మంది కూలీలతో ఆయన మాట్లా డారు. ప్రతీరోజు రూ.237 వచ్చేంత వరకు పని చేయాలన్నారు. ఉదయం పూట వచ్చి స్పీడ్‌గా పనిచేసే వారికి రూ.4నెలల పాటు పనులు కల్పి స్తామన్నారు. ఆదివారం మినహా ప్రతీరోజు ఉ పాధి హామీ పనులను కల్పించాలని అధికారుల ను ఆదేశించారు. కూలీలు ఉదయం పనికి రాగా నే మేట్లతో కొలతలు తీసుకొని కొలతల ప్రకారం నిబంధనల మేరకు పనిచేస్తే తగిన కూలి వస్తు ందని తెలిపారు. అనంతరం గ్రామంలోని నర్స రీ, పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు. ఈ కా ర్యక్రమంలో సర్పంచ్‌ మచ్చర్ల సాయన్న, వైస్‌ ఎంపీపీ దేవేందర్‌, ఉపసర్పంచ్‌ ముప్పెడ నారా యణ, ఎంపీడీవో నాగవర్ధన్‌, వివిధ శాఖల అధి కారులు, స్థానిక నాయకులు ఉన్నారు. 

Follow Us on:
Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.