బృహత్‌వనం ప్రణాళిక సిద్ధం

Aug 2 2021 @ 23:40PM
ఎక్మాయి వద్ద స్థలాన్ని పరిశీలిస్తున్న ఎంపీడీవో హరినందన్‌రావు

  • ఎక్మాయి వద్ద 10 ఎకరాల్లో మెగా పార్కు
  • రూ.45 లక్షలతో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం


బషీరాబాద్‌: ఆహ్లాదాన్ని అందించేందుకు పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం పర్యావరణ  ప్రయోజనాలు సమాకూర్చేందుకు మండలానికో బృహత్‌వనం(మెగా పార్కు) ఏర్పాటుకు సిద్ధమైంది.  ఇందులో భాగంగా బషీరాబాద్‌ మండలం ఎక్మాయి గ్రామ శివారులోని పార్కుకు అవసరమైన స్థలాన్ని మూడు రోజుల కిందట ఎంపీడీవో హరినందన్‌రావు, స్థానిక సర్పంచ్‌ నాదీర్గా నారాయణ, కార్యదర్శి రవి, ఈజీఎస్‌ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఇక్కడా 10ఎకరాల మేరకు స్థలాన్ని గుర్తించిన అధికారులు ప్రభుత్వానికి నివేదించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మెగా పార్కుకు రూ.45 లక్షలు వెచ్చించనుండగా సామగ్రి, మొక్కలకు రూ.28 లక్షలు, కూలీలకు రూ.17లక్షలు కేటాయించనున్నారు.

Follow Us on: