థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధం

ABN , First Publish Date - 2021-08-03T05:17:09+05:30 IST

థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అధికారులంతా సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో సోమవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కొన్ని దేశాల్లో ఇప్పటికే కొవిడ్‌ మూడోదశ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయని గుర్తు చేశారు.

థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధం
మాట్లాడుతున్న కలెక్టర్‌ సూర్యకుమారి

కలెక్టర్‌ సూర్యకుమారి

కలెక్టరేట్‌, ఆగస్టు 2: థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అధికారులంతా సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో సోమవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కొన్ని దేశాల్లో ఇప్పటికే కొవిడ్‌ మూడోదశ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయని గుర్తు చేశారు.  ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రులను సిద్ధం చేయాలన్నారు. ఏ వ్యక్తి కూడా కొవిడ్‌ చికిత్స కోసం బయటకు వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా చూడాలన్నారు. పిల్లలకు చికిత్స అందించేందుకు అనువైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. సమావేశంలో జేసీలు మహేష్‌కుమార్‌, వెంకటరావు, జిల్లా వైద్యాధికారి రమణకుమారి తదితరులు పాల్గొన్నారు. 

ఫోర్టిఫైడ్‌ బియ్యంతో సూక్ష్మ పోషకాలు 

ఫోర్టిపైడ్‌ బియ్యంతో సూక్ష్మ పోషకాలు లభిస్తాయని కలెక్టర్‌ సూర్యకుమారి అన్నారు. ఈ బియ్యంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు రూపొందించిన కరపత్రాలను స్పందన కార్యక్రమం వద్ద ఆవిష్కరించారు. 

అధికారులతో ఆత్మీయ సమావేశం 

జిల్లా అధికారులతో సోమవారం రాత్రి కలెక్టరేట్‌ ఆడిటోరియంలో కలెక్టర్‌ ఆత్మీయ సమావేశం  జరిగింది. కలెక్టర్‌ సూర్యకుమారి, ఎస్పీ దీపికాపాటిల్‌,  జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి, జేసీలు కిషోర్‌ కుమార్‌, మహేష్‌కుమార్‌, మయూర్‌ అశోక్‌, జె.వెంకటరావు, ఐటీటీఏ పీవో కూర్మనాథ్‌, సబ్‌ కలెక్టర్‌ భావ్న, డీఆర్‌వో గణపతిరావు, జిల్లా అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-08-03T05:17:09+05:30 IST