జగన్‌ను సాగనంపేందుకు సిద్ధం

ABN , First Publish Date - 2022-05-20T05:37:33+05:30 IST

ప్రజావ్యతిరేక విధానా లను అవలంభిస్తున్న ముఖ్యమంత్రి జగ న్‌మోహన్‌రెడ్డిని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ జాతీ య ప్రదాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమా ర్‌రెడ్డి పేర్కొన్నారు.

జగన్‌ను సాగనంపేందుకు సిద్ధం
పీలేరులో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి

 బాదుడే.. బాదుడులో టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి

పీలేరు, మే 20: ప్రజావ్యతిరేక విధానా లను అవలంభిస్తున్న ముఖ్యమంత్రి జగ న్‌మోహన్‌రెడ్డిని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ జాతీ య ప్రదాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమా ర్‌రెడ్డి పేర్కొన్నారు.  గురువారం పీలేరులో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్ర మంలో పాల్గొని ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో కరెంటు లేక చీకట్లు కమ్ముకున్నాయని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు, ఆర్టీసీ ఛార్జీల భా రం మోయలేక సామాన్య, మధ్యతరగతి ప్రజ లు అష్టకష్టాలు పడుతున్నారన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభు త్వంతోపాటు ఆ పార్టీ నేతలపై ప్రజల తిరుగుబాటు మొదలైందని, ఎన్నికల ముందు జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు.  రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలన్న ప్రజలు  టీడీపీని ఆశీర్వదించి పార్టీ  అధినేత చంద్రబా బునాయుడును సీఎం చేయాలని కోరారు. కార్యక్రమం లో రాజంపేట టీడీపీ పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి కోటపల్లె బాబురెడ్డి, పీలేరు మండల కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వారణాశి శ్రీకాంత్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, మాజీ జడ్పీటీసీ మల్లెల రెడ్డిబాషా, జాండ్ల మాజీ సర్పంచు శ్రీనివాసులు, నాయకులు కంచి సూరి, దామో దర్‌రెడ్డి, అమరనాధరెడ్డి, షౌకత్‌అలీ, రవికుమార్‌, రహంతుల్లా, మున్వర్‌అలీ, రామ్మూర్తి, రాజ పాల్గొన్నారు  


 ప్రజల నడ్డి విరుస్తున్న వైసీపీ

నిమ్మనపల్లె, మే 19: వైసీపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపి వారి నడ్డివిరుస్తోందని  టీడీపీ రాజంపేట అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్‌ ప్రజలకు వంద రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు.  స్టీల్‌, సిమెంట్‌ ధరలను పెంచి ఇసుకను ట్రాక్టర్‌ లోడు రూ.5000లు పెంచినట్లు తెలిపారు. కడపలో చంద్రబాబు పర్యటినకు ప్రజలు నుంచి అనూహ్యంగా స్పందన వచ్చిందన్నారు. దీంతో జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోయే పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటరమణ, మైనారిటీ అధికార ప్రతినిధి అన్వర్‌భాషా, జె.రామచంద్ర, పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T05:37:33+05:30 IST