పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం

ABN , First Publish Date - 2021-04-16T06:55:25+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఉప ఎన్నికల సందడి మొదలైంది. జిల్లాలో 12 మండలాలు ఉండగా పది మండలాల్లో 35 గ్రామపంచాయతీల పరిధిలో ఎన్నికల హడావుడి నెలకొంది.

పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం

- మూడు సర్పంచ్‌.. 60 వార్డుల్లో ఎన్నికలకు ఏర్పాట్లు 

- ఓటర్ల తుది జాబితా వెల్లడి

- 62 పోలింగ్‌ స్టేషన్లు.. 7,942 మంది ఓటర్లు 

- మేలో నోటిఫికేషన్‌కు అవకాశం

(ఆంరఽధజ్యోతి సిరిసిల్ల)

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఉప ఎన్నికల సందడి మొదలైంది. జిల్లాలో 12 మండలాలు ఉండగా పది మండలాల్లో 35 గ్రామపంచాయతీల పరిధిలో ఎన్నికల హడావుడి నెలకొంది. ఓటర్ల తుది జాబితాను బుధవారం వెల్లడించారు. మేలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికలు ఉన్న సర్పంచ్‌, వార్డు స్థానాల్లో ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

- ఎన్నికలు జరిగే స్థానాలు..

జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా వీటి లో 35 గ్రామ పంచాయతీల పరిధిలో 3 గ్రామ సర్పంచ్‌లు, 60 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామ సర్పంచ్‌తో పాటు 8 వార్డులు, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి సర్పంచ్‌ స్థానంతో పాటు పది వార్డులు, వీర్నపల్లి మండలం బావుసింగ్‌ నాయక్‌ తండా సర్పంచ్‌ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటితో పాటు బోయినపల్లి మండలంలో దేశాయిపల్లిలో 7వ వార్డు, మల్కాపూర్‌లో 6వ వార్డు, రామన్నపేటలో 8వ వార్డు, స్థంబంపల్లిలో 5వ వార్డు, చందుర్తి మండలం బండపల్లిలో 5వ వార్డు, మల్యాలలో 11వ వార్డు, గంభీరావుపేట మండలం దేశాయిపేటలో 5వవార్డు, కోనరావుపేట మండలంలో ధర్మారంలో 1వ వార్డు, 7వ వార్డు, 10వ వార్డు, కనగర్తిలో పదవ వార్డు, మల్కపేటలో 1వ వార్డు, మర్తనపేటలో 4వ వార్డు, 5వ వార్డు, మరిమడ్లలో 2వ వార్డు, 5వ వార్డు, 7వ వార్డు, 9వ వార్డు, నిమ్మపల్లిలో 2వ వార్డు, నిజామాబాద్‌లో 8వ వార్డు, 11వ వార్డు, 12వ వార్డు, పల్లిమక్తలో 3వ వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సుద్దాలలో 2వ వార్డు, ముస్తాబాద్‌ మండలం అవునూర్‌లో 2వ వార్డు, గొపాల్‌పల్లిలో 5వ వార్డు, తంగళ్లపల్లి మండలంలో అంకుసాపూర్‌లో 9వ వార్డు, గండిలచ్చపేటలో 1వ వార్డు, లక్ష్మీపూర్‌లో 4వ వార్డు, మల్లాపూర్‌లో 1వ వార్డు, నేరేళ్లలో 3వ వార్డు, 9వ వార్డు, రాళ్లపేటలో 4వ వార్డు, 8వ వార్డు, తంగళ్లపల్లిలో 9వ వార్డు, వేణుగోపాల్‌పూర్‌లో 4వ వార్డు, వీర్నపల్లి మండలంలో గర్జనపల్లిలో 6వవార్డు, శాంతినగర్‌లో 1వ వార్డు, వేములవాడ మండలంలో అరెపల్లిలో 5వ వార్డు, వేములవాడ రూరల్‌ మండలం మల్లారంలో 6వ వార్డు, తుర్కాశినగర్‌లో 4వవార్డు, వట్టెంల్లలో 8వ వార్డులో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

 ఓటర్ల వివరాలు..

జిల్లాలోని 35  గ్రామ పంచాయతీల పరిధిలో 3 సర్పంచ్‌లు, 60 వార్డుల్లో 7,942 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 62 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. తుది ఓటరు జాబితా ప్రకారం దేశాయిపల్లిలో 86 మంది ఓటర్లు, మల్లాపూర్‌లో 148 మంది, రామన్నపేటలో 91 మంది, స్థంబంపల్లిలో 120 మంది బండపల్లిలో 140 మంది, మల్యాలలో 263 మంది, గొల్లపల్లిలో 409 మంది, దేశాయిపేటలో 61 మంది, ధర్మారంలో 582 మంది, కనగర్తిలో 164 మంది, మల్కపేటలో 161 మంది, మర్తనపేటలో 212 మంది, మరిమడ్లలో 466 మంది, నాంపల్లిలో 229 మంది, నిజామాబాద్‌లో 700 మంది, పల్లిమక్తలో 130 మంది, సుద్దాలలో 185 మంది, అవునూర్‌లో 210 మంది, గొల్లపల్లిలో 38 మంది, అంకుసాపూర్‌లో 149 మంది, గండిలచ్చపేటలో 103 మంది, లక్ష్మీపూర్‌లో 130 మంది, మల్లాపూర్‌లో 35 మంది, నేరేళ్లలో 259 మంది, రాళ్లపేటలో 212 మంది, తంగళ్లపల్లిలో 360 మంది, వేణుగోపాల్‌పూర్‌లో 59 మంది, బద్దెనపల్లిలో 1,154 మంది, గర్జనపల్లిలో 112 మంది, శాంతినగర్‌లో 59 మంది, బావుసింగ్‌ నాయక్‌ తండా లో 492 మంది, అరెపల్లిలో 50 మంది, మల్లారంలో 151 మంది, తుర్కాశినగర్‌లో 54 మంది, వట్టెంలలో 174 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఏకగ్రీవాల వైపు కూడా దృష్టి పెట్టడంతో ఆశావహు లు, ఓటర్లలో ఆసక్తి ఏర్పడింది. 


Updated Date - 2021-04-16T06:55:25+05:30 IST