Advertisement

సాయుధ పోరాటంతో ప్రజాస్వామ్య పరిరక్షణ

Sep 16 2020 @ 00:44AM

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం


భగత్‌నగర్‌, సెప్టెంబరు 15: సాయుధ పోరాటంతో ప్రజా స్వామ్య పరిరక్షణ జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా నగరంలోని అనభేరి ప్రభాకర్‌ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముకుందలాల్‌ మిశ్రాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాయుధ పోరాటంతో భూస్వాములు పారిపోయి, వెట్టి చాకిరి నుంచి విముక్తి లభించిందన్నారు. అక్రమ కేసులు పెట్టి కమ్యూనిస్టుల గొంతు అణగదొక్కాలని చూస్తున్నారన్నారు.


తెలంగాణ ప్రభుత్వం భూస్వాములకు వంత పాడుతూ పేదలను విస్మరించిందన్నారు. కౌలు రైతులపై వివక్ష చూపిస్తోందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కమ్యూనిస్టులకు ఇంతకన్నా పెద్ద ఉత్పతాలను ఎదుర్కొన్న చరిత్ర ఉందన్నారు. వెనుకడుగు వేసేది లేదని పేదల పక్షాల ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, వర్ణవెంకట్‌రెడ్డి, బీమాసాహేబ్‌, సపంత్‌, ఎడ్ల రమేష్‌, బండారి శేఖర్‌, సత్యం పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement
Advertisement