ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత

ABN , First Publish Date - 2021-01-22T05:21:10+05:30 IST

ఆలయాలను పరిరక్షించుకో వాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఐ వినోద్‌బాబు తెలిపారు. గురువారం రఽథంవీధిలో గల పెద్ద జగన్నాఽథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలు పునరావృ తం కాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలతో పాటు విలేజ్‌ డిఫెన్స్‌ స్క్వాడ్‌ను ఏర్పాటుచేసి నట్లు తెలిపారు.

ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత
అర్చకులు, నిర్వాహకులతో మాట్లాడుతున్న సీఐ వినోద్‌బాబు


ఇచ్ఛాపురం: ఆలయాలను పరిరక్షించుకో వాల్సిన బాధ్యత  అందరిపై  ఉందని సీఐ వినోద్‌బాబు తెలిపారు. గురువారం రఽథంవీధిలో గల పెద్ద జగన్నాఽథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలు పునరావృ తం కాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలతో పాటు విలేజ్‌ డిఫెన్స్‌ స్క్వాడ్‌ను  ఏర్పాటుచేసి నట్లు తెలిపారు.  ప్రతిరోజూ ఒకసారి ఆలయాలను సందర్శించి అక్కడ పరిస్థితులను తెలుసుకొని సమాచారం ఇవ్వాలని విలేజ్‌ డిఫెన్స్‌ స్క్వాడ్‌కు సూచించారు. అనంతరం సీసీ కెమెరాలతోపాటు జగన్నాథస్వామి రఽథాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ, ఉషారాణి, ఆలయాల పరిరక్షణ కమిటీ సభ్యులు, ఆలయ  అర్చకులు పాల్గొన్నారు. 


మనమే కాపాడుకోవాలి

 మెళియాపుట్టి: గ్రామాల్లోని ఆలయాలను మనమే కాపాడుకోవాలని పాతపట్నం సీఐ రవిప్రసాద్‌ అన్నారు. గురువారం మెళియాపుట్టిలో అన్ని కులాలు, మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవుళ్ల పేరుతో రాజకీయాలు మంచి పద్ధతి కాదన్నారు.  ఆలయాలపై దాడుల నియంత్రణలో గ్రామ కమిటీలు భాగస్వా మ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సందీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

 

Updated Date - 2021-01-22T05:21:10+05:30 IST