నాటిన మొక్కలను సంరక్షించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-21T06:53:04+05:30 IST

జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను సం రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్‌ ముషారఫ్‌అలీఫారూఖీ అన్నారు.

నాటిన మొక్కలను సంరక్షించాలి : కలెక్టర్‌
సోన్‌ జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలిస్తున్న కలెక్టర్‌

సోన్‌, మే 20 : జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను సం రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్‌ ముషారఫ్‌అలీఫారూఖీ అన్నారు. హరితహారంలో భాగంగా సోన్‌ జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను శుక్రవారం పరిశీలించారు. మల్టీలేయర్‌ అవెన్యూ ప్లాంటే షన్‌పై ప్రత్యేకశ్రద్ద కనబరచాలని ఆదేశించారు. నాటిన ప్రతీమొక్కను సంరక్షించాలని, మొక్కల మధ్యలో దూరం ఉండకుండా మరిన్ని మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. ఇరువైపులా చెత్తాచెదారం లే కుండా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొక్కల కు క్రమం తప్పకుండా నీరుపోసి సంరక్షించాలని అన్నారు. ఇందులో అద నపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, డీఆర్డీవో పీడీవిజయలక్ష్మి, తహసీల్దార్‌ హిమబిందు, ఎంపీడీవో సాయిరాం, తదితరులు పాల్గొన్నారు. 

ఇష్టపడి చదివితే ఉద్యోగాలు లభిస్తాయి

నిర్మల్‌ కల్చరల్‌, మే 20 : పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఇష్టపడి చదివితే ఉద్యోగాలు సాధించడం కష్టమేమి కాదని, అవకాశాలు సద్విని యోగపరుచుకోవాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ పిలుపునిచ్చారు. శుక్ర వారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పీజీకళాశాలలో నిర్వహిస్తున్న ఎస్సైలు, కానిస్టేబుళ్ల ఉద్యోగ ఉచిత శిక్షణా శిబిరాన్ని సందర్శించి స్టడీ మెటీరియల్‌ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. అన్నిరకాల పోటీపరీక్షలు సమర్థవంతంగా రాసేందుకు ఉచితశిక్షణ దోహదం చేస్తోందన్నారు. స్టడీ మెటీరియల్‌ యువతకు ఉప యుక్తంగా ఉంటుందన్నారు. ప్రతీఈవెంట్‌లోనూ విజయం సాధించాలంటే పట్టుదల ఉండాలన్నారు. దృఢనిశ్చయంతో ముందుకు వెళ్లాలని, సమయం వృధా చేయరాదన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే అమ్మాయిలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని వాటిని లెక్కచేయకుండా లక్ష్యంవైపు దృష్టి పెట్టి విజయం సాధించాలని సూచించారు. తమ సందేహాలు ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని, క్రమశిక్షణ, సమయపాలన విజయ సాధన సోపానా లని అన్నారు. ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ... ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించి నిర్మల్‌లో ఉచితశిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేసినందుకు కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ జీవన్‌రెడ్డి, డీఈవో రవీందర్‌రెడ్డి, ఇతర పోలీస్‌ ఇన్స్‌పెక్టర్లు రమేష్‌ హతిరాం, రామకృష్ణ, వినోద్‌ పాల్గొన్నారు.

పదిపరీక్ష ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌

23న పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నందున శుక్రవారం కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ ఏర్పాట్లను పరిశీలించారు. చాణక్య హైస్కైల్‌ కేంద్రం సందర్శించి సూచనలు చేశారు. పొరపాట్లు జరుగకుండా అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, డీఈవో రవీందర్‌ రెడ్డి ఉన్నారు. 


Updated Date - 2022-05-21T06:53:04+05:30 IST