కళలను కాపాడడం అందరి బాధ్యత : జోగురామన్న

ABN , First Publish Date - 2021-09-18T05:57:13+05:30 IST

అంతరించిపోతున్న కళలను కాపాడడం సమాజంలో అందరి బాధ్యత అని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు.

కళలను కాపాడడం అందరి బాధ్యత : జోగురామన్న
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌, సెప్టెంబరు17 (ఆంధ్రజ్యోతి) : అంతరించిపోతున్న కళలను కాపాడడం సమాజంలో అందరి బాధ్యత అని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. కళలు, సంస్కృతులకు జీవం పోసే దిశగా పనిచేస్తున్న జాతీయస్థాయి కళాకారుడు మిట్టురవి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళమ్మతల్లి విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిట్టురవి ఏర్పాటు చేసిన యూట్యుబ్‌ ఛానల్‌ ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో కథలు, సంస్కృతులు, ఆచార సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డిభోజారెడ్డి, రంగినేని శ్రీనివాస్‌, కృష్ణ, గణేష్‌, శంకర్‌, హార్ష, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు.

మున్నూరుకాపు సంఘ సభ్యుల వినతి

తెలంగాణ మున్నూరుకాపు సంఘం కన్వీనర్‌ సర్దార్‌పురుషోత్తమ్‌రావు పటేల్‌ ఇచ్చిన పిలుపు మేరకు మున్నూరుకాపు సంఘ సభ్యులు ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు. మున్నూరుకాపులకు ప్రత్యేక కార్పోరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. మున్నూరుకాపుల సంక్షేమానికి కృషి చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సుగ్యంవిఠల్‌, సందఅశోక్‌, కాళ్లవిఠల్‌, శ్రీరాం, ప్రభా, బొడిగెమమత తదితరులున్నారు.


Updated Date - 2021-09-18T05:57:13+05:30 IST