President Draupadi Murmu: రాష్ట్రపతితో గవర్నర్‌ భేటీ

ABN , First Publish Date - 2022-08-07T15:58:20+05:30 IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(State Governor RN Ravi) భేటీ అయ్యారు. శనివారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన

President Draupadi Murmu: రాష్ట్రపతితో గవర్నర్‌ భేటీ

చెన్నై, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(State Governor RN Ravi) భేటీ అయ్యారు. శనివారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన గవర్నర్‌.. రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఇటీవలే ఎన్నికైన విషయం తెలిసిందే. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్రపతితో గవర్నర్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు రాజ్‌భవన్‌(Raj Bhavan) ప్రకటించింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌.. శనివారం రాష్ట్రపతితో భేటీ అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం రాత్రికి చెన్నైకి చేరుకున్నారు.

Updated Date - 2022-08-07T15:58:20+05:30 IST